YCP : వలస నేతలకే వైసీపీ అందలం..పార్టీని నమ్ముకున్నవాళ్లకు..

YCP

YCP

YCP : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ పలు చోట్ల అభ్యర్థులను మారుస్తున్నారు. మారుతున్న సమీకరణల నేపథ్యంలో ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో వారికి టికెట్ ఖరారు చేస్తున్నారు. ఇదివరకే అక్కడ పోటీలో ఉన్న వారికి సైతం భంగపాటు తప్పడం లేదు.

పవన్ కల్యాణ్ ను తిట్టిపోస్తున్న పోతిన మహేష్ కు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. కర్నూలు ఎంపీ స్థానాన్ని కూడా మారుస్తున్నారు. టీడీపీ నుంచి కేఈ ప్రభాకర్ కు కండువా కప్పి టికెట్ ఖరారు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం కర్నూలు మేయర్ బీవై రామయ్యను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఇలా వైసీపీ తన అభ్యర్థులను మారుస్తూ కొత్తగా వచ్చిన వారికి ఆఫర్ ఇస్తోంది.

ఇలా ప్రతిసారి పార్టీని నమ్ముకున్న వారికి నిరాశే మిగులుతోంది. కష్టకాలంలో ఆదుకున్నా తరువాత ఎవరి కోసమో టికెట్ ను త్యాగం చేయాల్సి రావడం గమనార్హం. కేఈ క్రిష్ణమూర్తి కుమారుడు ఇప్పటికే డోన్ నుంచి పోటీ చేస్తున్నారు. కేఈ ప్రభాకర్ కు సీటు నిరాకరించడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. వైసీపీ పిలిచి ఆఫర్ ఇస్తుండటతో పోటీకి రెడీ అయ్యారు.

గుంటూరు ఎంపీ స్థానంలో రోశయ్య సుముఖంగా లేరు. పి. గన్నవరం నియోజకవర్గంలో పాముల రాజేశ్వరి దేవికి టికెట్ ఇస్తున్నారు. దీంతో వైసీపీలో చాలా మంది సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీని వల్ల కొందరు హర్ట్ అయ్యి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు రోజురోజుకూ మార్పు చెందుతున్నాయి.

TAGS