Actor Mouli : బరితెగించిన వైసీపీ బూతు మాఫియా..పాపం యువనటుడు మౌళిపై కూడా..
Actor Mouli : #90s మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. సగటు జీవుల జీవితాలను ఆ సిరీస్ ప్రతిబింబించడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆ సినిమాలోని యాక్టర్లకు ఎంతో పేరు వచ్చింది. లీడ్ రోల్ చేసినా శివాజీ సెకండ్ ఇన్నింగ్స్ కు ఈ వెబ్ సిరీస్ గ్రాండ్ సక్సెస్ పునాది వేసిందనే చెప్పాలి. ఇక ఇందులో శివాజీ భార్య, కొడుకులు, కూతురి పాత్రధారులకు మంచిపేరు వచ్చింది.
శివాజీ పెద్ద కొడుకుగా నటించిన యువనటుడు మౌళిపై తాజాగా వైసీపీ బూతు మీడియా తమ గురి ఎక్కుపెట్టింది. ఆయన చేసిన పాపమల్లా..రాజధానిని మాయం చేయడం. స్టేజ్ ఎక్కితే నలుగుర్ని నవ్వించడంలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మౌళి. .ఇటీవల ఓ కార్యక్రమంలో రాజధానిని మాయం చేశానని జోక్ వేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే వైసీపీ బూతు మాఫియా.. తమ బూతుల ఆయుధాలతో రంగంలోకి దిగిపోయింది.
మౌళినే కాదు అతడి పేరెంట్స్ ను సైతం వదిలిపెట్టలేదు. ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం ప్రారంభించారు. దీంతో భయపడిపోయిన మౌళి సారీ చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. తన తల్లిదండ్రులను ఇందులోకి లాగొద్దని కోరారు. తాను ఓ జోక్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ప్రజలను నవ్వించడమే తన గోల్ అని రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదన్నారు. మౌళి చేసిన సోషల్ మీడియా ప్రకటనతో వైసీపీ బూతు మీడియా ఎంతకైనా బరితెగిస్తుందని అర్థమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీ రాజధాని ఏదనేది వైసీపీ వాళ్లు కూడా చెప్పలేరు. ఉన్న నిజాన్ని జోకులుగా చెప్పినా వైసీపీ వాళ్లకు కోపం వస్తుంది. అయినా వైసీపీ నేతలకు ఎదురుదాడి అంటే బూతులే అన్నట్టుగా మారిపోయింది. ప్రతీ ఒక్కరిని బూతులు తిట్టి.. ఏదో చేద్దామనుకుంటున్నారు. అందరినీ మానసికంగా వేధించాలనుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి అత్యంత ఘోరమైనదని.. వైసీపీ అధినేత ఓ విష సంస్కృతిని ప్రవేశపెట్టారని విమర్శలు వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఏ ఒక్క సాధారణ మనిషి కూడా ప్రభుత్వాన్ని విమర్శించడానికి కానీ.. కనీసం జోక్ చేయడానికి భయపడే అవకాశాలు ఉన్నాయి.