YCP 11th List : 11వ జాబితాను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం..
YCP 11th list: ఏపీ: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 వ జాబితాను విడుదల చేసింది. ఇందులో రెండు పార్లమెంటు, ఒక అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ ఇన్చార్జి లను ప్రకటించింది.
కర్నూలు పార్లమెంట్ ఇన్చార్జిగా బివై రామయ్య, అమలాపురం పార్లమెంట్ ఇన్చార్జిగా రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ ఇన్చార్జిగా గొల్లపల్లి సూర్యరావు పేర్లను ప్రకటించింది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యం లో అభ్యర్థుల ఎంపికపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిం ది. పెండింగ్ లో ఉన్న నియోజ కవర్గాలకు, పార్లమెంట్ స్థానాల కు అభ్యర్థులను ఎంపిక చేస్తూ లిస్టును విడుదల చేస్తోం ది.
అయితే గతంలో పోటీ చేసిన సిట్టింగ్ లకు కాదని కొత్తవారికి అవకాశం ఇస్తున్న నేపథ్యంలో వైసీపీలో అంతర్గత విభేదాలు ఏర్పడ్డాయి. ఎంతోకాలంగా పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా కొత్త వారికి ఇలా టికెట్ ఇస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.