AB Venkateshwar Rao : చేయని తప్పుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఎబి వెంకటేశ్వర్ రావును సస్పెండ్ చేసింది. దింతో అయన హై కోర్టు కు వెళ్లగా న్యాయస్థానం ఆయనకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ తరువాత కేసు సుప్రీం కోర్టుకు వెళ్ళింది అక్కడ కూడా వెంకటేశ్వ రావు ను సమర్థిస్తూ కోర్టు గురువారం తీర్పు ప్రకటించింది. రెండేళ్ల రెండు నెలలకు తీర్పు రావడంతో ఆయన తన సస్పెన్షన్‌కు కారకులైన వారిపై నిప్పులు చెరిగారు. ఉద్యోగులు ధర్మం పాటించాలి. తప్పును తప్పుగా చూడాలి. కానీ చేయని తప్పుకు ఒకరి సంతోషం కోసం మరొకరిని బలిచేయరాదు అంటు ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే,మరోవైఫు తన తోటి ఐఏఎస్,ఐపీఎస్ అఇకారులపై నిప్పులు చెరిగారు.
నేను పక్కా లోకల్..
ఆవుకథ చెబుతూ, సినిమా స్టయిల్లో పంచ్ డైలాగులు విసురుతూ సస్పెన్షన్‌కు కారకులైనవారిపై శివమెత్తారు. నేను పక్కా లోకల్. ఇక్కడే ఉంటా నేను అంటే ఏమిటో చూపిస్తా.ఇక నుంచి న విశ్వరూపం ఏమిటో కూడా చూస్తారు.ప్రభుత్వాన్ని నడిపేది సైకోల,మెదడు ఉన్నోళ్ల, ఏ సైకో కోసం నన్ను సస్పెండ్ చేసారు. ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం నేను చేయని తప్పుకు సస్పెండ్ చేసారు. ఏ శాడిస్టు కోసం నన్ను బలిచేసి మీరు తృప్తి పడ్డారు. నా సర్వీస్ లో 12 ఐఏఎస్,ఐపీఎస్ బ్యాచ్ లను చూసా. ఎంతో మంది అధికార మేధావులను చూసా. కానీ ఇంత ఇంగిత జ్ఞానం లేని అధికారులను నా సర్వీసులో చూడలేదు.బహుశా చూడబోనని కూడా అనుకుంటున్న. ప్రభుత్వాలు వస్తుంటాయి.పోతుంటాయి. కానీ ఉద్యోగ ధర్మం పాటించాలి. ప్రజలు మనకు శాశ్వతం. ఆ ప్రజలు చేసిన చట్టం శాశ్వతం.ప్రజలు చేసిన చట్టంతో మనం పని చేయాలి. కానీ ఒకటిరి తొత్తుగా పనిచేయరాదు అంటూ తనపై అకారణంగా తప్పు మోపిన అధికారులపై నిప్పులు చెరిగారు.
అధికారం శాశ్వతం కాదు
ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. అంత మాత్రాన ఆ ప్రభుత్వాల నీడన మనం బతుక కూడదు. చీఫ్ సెక్రటరీలు కూడా ఎప్పుడు రాష్ట్రాన్ని పట్టుకొని ఉండరు. వారు కూడా నీడ లాంటివారే అన్నారు. పలువురు ఐపీఎస్,ఐఏఎస్ అధికారుల పనితీరుపై కూడా అసహనం వ్యక్తం చేసారు. మీరు ఎవరికోసం పనిచేస్తున్నారు. పాలకుల అభివృద్ధి కోసమా,,లేదంటే ప్రజల అభివృద్ధికోసమా అంటూ ప్రశ్నించారు. మీకంటూ ఒక సొంత ఆలోచన విధానం లేదా, ఎవరైనా నివేదికలు ఇస్తే వాటిని కనీసం పరిశీలించి నిర్ణయాలు తీసుకునే పరిజ్ఞానం కూడా లేదా అని ప్రశ్నించారు. సీఐడీ డిఎస్పీ ఇచ్చిన నివేదికను కనీసం చూసి చర్యలు తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు.
ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి
నివేదికలో వ్యాకరణ దోషాలు, ఫుల్స్టాప్,కామ లేకుండా ఇచ్చిన నివేదిక పరిగణలోకి ఎలా తీసుకుంటారన్నారు. వృత్తిలో నైపుణ్యం ఉండాలి.ఎవరు ఏది చెబితే దాన్నే తప్పుగా నిర్ణయించరాదు.చివరకు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే నివేదికను కూడా సరిచూసుకోకుండా పంపారు. పద్ధతులు మార్చుకొని,ప్రజల సంక్షేమం కోసం పనిచేయండి అంటూ తన సస్పెండు కు కారకులైనవారిపై ఒకవైపుఆక్రోశం వెళ్ళగగ్గుతూనే,మరోవైపు తన తోటి అధికారులుగా గుర్తిస్తూ గీతోపదేశం చేస్తూ దుమ్ము దులిపేశాడు ఐపీఎస్ అధికారి అయిన ఎబి వెంకటేశ్వర్ రావు.