Nakka Anand Babu : మనసున్న మారాజే ‘వేమూరు’ విజేత..అందరివాడు ఆనందుడే

Nakka Anand Babu
Nakka Anand Babu : వేమూరు నియోజకవర్గానికి రాష్ట్రంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సినీ, రాజకీయ రంగాల్లో ఈ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ఆయా రంగాలలో పలువురు ఉద్దండులు ఈ ప్రాంతానికి చెందినవారే కావడం విశేషం. రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గంలో ఉన్నత విద్యావంతులు, అత్యంత సేవా గుణం వారు ఉన్నారు. యలమర్తి నాయుడమ్మ వంటి గొప్ప శాస్త్రవేత్తలు పుట్టిన నియోజకవర్గమిది. కల్లూరి చంద్రమౌళి లాంటి గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ ఇంటి నుంచి ఒక్కరైనా విదేశాల్లోకి వెళ్లి సెటిల్ అయినవారు ఉన్నారు. పుట్టిన ఊరు కోసం గుడులు, బడులు, ఆస్పత్రులు, అనాథాశ్రమాలు కట్టించి వారు గొప్ప సేవను అందిస్తున్నారు. తానాకు వ్యవస్థాపకులు, మొట్టమొదటి చైర్మన్ కూడా వేమూరి వాసే కావడం విశేషం. ఈ నియోజకవర్గపు ఓటర్ల సంఖ్య 1,85,485. వ్యవసాయం ఇక్కడి ప్రజల జీవనాధారం. వరి, అపరాలు, కాయగూరలు పండిస్తారు.
ఇంతటి ప్రత్యేకతలు ఉన్న నియోజకవర్గానికి అంతే గొప్ప వ్యక్తిత్వం, సామర్థ్యం ఉన్న వ్యక్తే ఎమ్మెల్యేగా రావాలని స్థానికులు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున టీడీపీకి చెందిన నక్కా ఆనంద బాబు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న నీచమైన చరిత్ర, పనికిమాలిన అభియోగాలు ఉన్న వరికూటి అశోక్ బాబు వంటి వారు పోటీలో ఉన్నారని, ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే పదవిని కట్టబెడితే నియోజకవర్గానికి ఉన్న గొప్ప చరిత్రను కాలరాసిన వారమవుతామని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఎంతో మంది విద్యావంతులు, గొప్ప వ్యక్తులు ఉన్న నియోజకవర్గంలోని పలువురు యువత గంజాయి మత్తులో జోగుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇది వైసీపీ పాలనలో నియోజకవర్గ పరిస్థితి. రేప్ లు, మర్డర్లు, అరాచకాలు, దోపిడీలు, దందాల చరిత్ర వరికూటి అశోక్ బాబుది అని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదే నక్కా ఆనంద బాబు గారు నియోజకవర్గంలో పుట్టిన వ్యక్తిగా ప్రతీ ఊరు, ప్రతీ ఇల్లు తెలిసినవ్యక్తి. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను దగ్గరుండి చూసినవారు. ప్రజలకు మేలు చేయడమే ఆయనకు తెలిసింది. ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆనంద్ బాబు గారు సౌమ్యులే కాదు విద్యావంతుడు కూడా.
రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన నక్కా ఆనంద బాబు గారిపై ఇంత వరకు ఒక్క అవినీతి మరక లేకపోవడం గొప్ప విషయం. ప్రత్యర్థుల నుంచి సైతం ఒక్క చెడ్డ మాట అనిపించుకోని ఆయన వ్యక్తిత్వం నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు నక్కా ఆనంద బాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కంకణబద్ధులై ఉన్నారని ఇప్పటికే టాక్ నడుస్తుండడం గమనార్హం. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రపథాన నిలిపే ఏకైక నాయకుడు ఆనంద బాబు గారు మాత్రమేనని జనాలు గొంతెత్తి చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థి అశోక్ బాబుకు దారుణ ఓటమి రుచిచూపించబోతున్నామని ఢంకా బజాయించి మరి చెబుతున్నారు.