CM Jagan : అందుగలదు ఇందులేదు.. సందేహం వలదు.. జగన్ సర్కార్ పాలనలో ఎందెందు చూసినా అక్రమాలు కలవు. పోలీసులు, అధికారులను మేనేజ్ చేసి బతిమిలాడి, భయపెట్టి చేసిన ఈ అరాచకాలు ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి.
ఏపీలో అరాచకరాజ్యాన్ని జగన్ సృష్టించారు. ఎదురు తిరిగిన వాళ్లను తుదముట్టించారు. హత్యలు, దాడులతో బెంబేలెత్తించారు. అందుకే ఏపీ చరిత్రలో అత్యధిక మెజార్టీతో గెలిచిన జగన్ ను ఈ అరాచకపాలనతోనే అథ: పాతాళానికి తొక్కేశారు.
ఆంధ్రాలో జగన్ 11 స్థానాలతో చరిత్రలోనే చిత్తుచిత్తుగా ఓడడంతో ఆయన చేసిన అక్రమాలన్నీ ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా జగన్ రెడ్డి ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన అరాచకాల వీడయో వైరల్ అవుతోంది..
మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామం పోలింగ్ బూత్ 251 లో ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు పాలకీర్తి శ్రీనివాసరావు వీడియో కలకలం రేపింది. కనీసం ఓ పోలీసు ఉండి కూడా అతడిన ఏమీ అనలేక చోద్యం చూస్తూ పగులకొట్టేదాక చూస్తుండడం అందరినీ నివ్వెరపరుస్తోంది. పిన్నెల్లి, ఆయన అనుచరులు ఎంత దారుణంగా ప్రవర్తించారు. పోలీసులు ఎంతగా వారికి సహకరించారన్నది చూస్తే కలకలం రేపుతోంది.