Kavitha Bail : ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో అరకెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సోమవారం రౌస్ ఎవెన్యూలోని స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించనుంది. తన చిన్నకొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై జూన్ 4న విచారణ చేపట్టిన జడ్జి కావేరి బవేజా ఇరువైపులా వాదనలు ముగిసినట్లు స్పష్టం చేశారు.
కాగా, ఈ కేసులో కవితను మార్చి 15న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగా, సీబీఐ ఏప్రిల్ 11న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్నారు.