Condoms : కండోమ్ అనగా ముందుగా గుర్తొచ్చదేది సేఫ్ సెక్స్ కోసం ఉపయోగించే సాధనం. అపరిచిత వ్యక్తులతో శృంగారం కారణంగా ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధితో పాటు ఇతర సుఖ వ్యాధులు సంక్రమిస్తాయనే విషయం తెలిసిందే. దీంతో సెక్స్ కోరికలు అణుచుకోలేని వారు, సుఖ వ్యాధులు ఎయిడ్స్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించుకునేందుకు రూపొందించిన సేఫ్టీ సాధనం కండోమ్.
కండోమ్ సహజంగా గర్భనిరోధక సాధనంగానూ లేదా సుఖ వ్యాధుల నియంత్రణకు ఉపయోగిస్తుంటారు. కానీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కండోమ్ ను మరో విధంగా వాడారనే విషయం వెలుగు లోకి వచ్చింది. ఆధిపత్య ధోరణి, ఇతర దేశాలను ఆక్రమించుకునేందుకు జరిగిన మారణ హోమమే మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు. ఈ రెండు యుద్ధాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది క్షతగాత్రులయ్యారు. ఇప్పుడు అన్ని దేశాలు తమ సైనిక సామర్థ్యం పెంచుకోవడంతో పాటు ఆధునిక ఆయుద్ధ సంపత్తిని పెంచుకుంటున్నాయి.
అయితే రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులు అడవులు, ఇతర చిత్తడి ప్రాంతాల్లో ఉండి శత్రు దేశంపై పోరాడాల్సి వచ్చింది. ఈ క్రమంలో అక్కడ భారీ వర్షం కురిసినప్పుడు తుపాకులు, రైఫిళ్లు తడిసి తుప్పు పట్టి పోయేవి. ఈ క్రమంలో ఆయుధాలను కాపాడుకోవడానికి కండోమ్ లను రైఫిళ్లు, తుపాకులకు తొడిగారట. కండోమ్ లు రబ్బరు తో తయారు చేసినవి కావడంతో రైఫిళ్లు, తుపాకులు నీటిలో తడవకుండా ఉపయోగపడ్డాయట. రైఫిళ్ల మరమ్మతు ఖర్చును కూడా విపరీతగా తగ్గించాయట.