T20 World Cup : టీ20 వరల్డ్‌ కప్‌కు అంపైర్లు వీరే.. అందులో భారత్‌ నుంచి ఇద్దరికి అవకాశం..

T20 World Cup

T20 World Cup

T20 World Cup : T20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌-2024కు అమెరికా-వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయన్న సంగ‌తి తెలిసిందే. జూన్ 2వ తేదీ చెన్నై స్టేడియం వేదికగా అమెరికా-కెనడా మధ్య తొలి మ్యాచ్ తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ కోసం 20 మందితో కూడిన అంపైర్ జాబితాను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ (ఐసీసీ) విడుదల చేసింది.

ఈ జాబితాలో ఐసీసీ ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్‌లో సభ్యత్వం పొందిన అంపైర్లు 16 మంది, ఎమర్జింగ్ ప్యానెల్‌లోని 4గురు అంపైర్లు ఉన్నారు. ఈ లిస్టులో భారత్‌ నుంచి జయరామన్ మదనగోపాల్‌, నితిన్‌ మీనన్‌ కు చోటు లభించింది.

కాగా మదన గోపాల్‌కు ఐసీసీ ఈవెంట్‌లో అంపైరింగ్ చేసే అవ‌కాశం ఇదే మొద‌టిసారి రావడం. అత‌డితో పాటు సామ్ నోగాజ్‌స్కీ, అల్లావుడియన్ పాలేకర్, ఆసిఫ్ యాకూబ్‌, రషీద్ రియాజ్ కూడా తొలిసారి ఐసీసీ ఈవెంట్‌లో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

2022 T20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో అంపైర్లుగా వ్యవహరించిన కుమార్ ధర్మసేన, పాల్ రీఫిల్, క్రిస్ గఫానీ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

ఈ టోర్నీ కోసం మ్యాచ్‌ రిఫరీల జాబితాను కూడా ఐసీసీ ప్రకటించింది. డేవిడ్ బూన్, రంజన్ మడుగల్లె, జెఫ్ క్రోవ్, ఆండీ పైక్రాఫ్ట్, జవగల్ శ్రీనాథ్‌, రిచీ రిచర్డ్‌సన్ ను ఐసీసీ నియమించింది.

వ‌ర‌ల్డ్‌క‌ప్‌ అంపైర్లు..

క్రిస్ బ్రౌన్, కుమార్ ధర్మసేన, క్రిస్ గఫానీ, మైఖేల్ గోఫ్, అడ్రియన్ హోల్డ్‌స్టాక్, అల్లాహుడియన్ పాలేకర్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్‌బరో,  నితిన్ మీనన్, జయరామన్ మదనగోపాల్, సామ్ నోగాజ్‌స్కీ, రషీద్ రియాజ్, పాల్ రూసికా రీఫెల్, అహ్సన్ రజా, లాంగ్టన్ రుసెరే,  రోడ్నీ టక్కర్, జోయెల్ విల్సన్, ఆసిఫ్ యాకూబ్, అలెక్స్ వార్ఫ్ ఉన్నారు.

రిఫరీలు: డేవిడ్ బూన్, జ‌వగల్ శ్రీనాథ్. రంజన్ మడుగల్లె, జెఫ్ క్రోవ్, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్‌,

TAGS