HanuMan Twist : భారీ అంచనాల నడుమ నేడు విడుదలైన ‘హనుమాన్’ చిత్రానికి ఏ రేంజ్ పాజిటివ్ టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. దర్శకత్వ ప్రతిభ కి పరాకాష్ట గా నిల్చిన ఈ చిత్రం లో రోమాలు నిక్కపొడుచుకునే రేంజ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి.
అసలు ఇంత టాలెంట్ ఉన్న డైరెక్టర్ ని మన స్టార్ హీరోలు ఎందుకు వాడుకోలేదు?, ఆదిపురుష్ చిత్రానికి వాడెవడో బాలీవుడ్ దర్శకుడిని నమ్ముకునే బదులు, ప్రశాంత్ ని నమ్ముకొని ఉంటే ప్రభాస్ కి చరిత్రలో నిలిచిపొయ్యే రేంజ్ సినిమాని ఇచ్చేవాడు కదా అని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు అనుకున్నారు. ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు పతాక సన్నివేశాల్లో అయితే డైరెక్టర్ టేకింగ్ కి నోటి నుండి మాటలు కూడా రావు, ఆ రేంజ్ లో అదరగొట్టాడు. అయితే ఈ సినిమాకి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ అని మరొక సినిమా ఉందట. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదే.
ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని హాలీవుడ్ మార్వెల్ స్టూడియోస్ సిరీస్ లాగ ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ గా తియ్యబోతున్నాను అని ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యే ముందే చెప్పాడు. ఇతనేమైనా రాజమౌళినా?, అంత నమ్మకం ఏమిటి? అని అప్పట్లో నెటిజెన్స్ ప్రశాంత్ ని అవహేళన చేసారు. ఈరోజు అతని దర్శకత్వ ప్రతిభ ని చూసి వెక్కిరించిన వాళ్ళే నేడు పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. ఈ ఏడాది లోనే ‘జై హనుమాన్’ సినిమా ప్రారంభం కాబోతుంది అట. ఇందులో మరో సూపర్ హీరో కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మన దేవుళ్లలో ఉన్న అతీతమైన శక్తులు సాధారణ మానవులకు వస్తే ఎలా ఉంటుంది..?, వాళ్ళు ఈ లోకాన్ని ఎలా రక్షించారు అనేది ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ లో సూపర్ హీరోలు ఉంటారు.
ఇలా మన దేవుళ్ళ అతీతమైన శక్తులతో సూపర్ హీరో కాన్సెప్ట్ అనేది ఇప్పటి వరకు ఎవ్వరూ ఆలోచన చెయ్యలేదు. కచ్చితంగా ప్రశాంత్ వర్మ వీటితో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఏలుతాడు అనే చెప్పాలి. ఇకపోతే ఈరోజు విడుదలైన ‘హనుమాన్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు రేపే రేంజ్ ఓపెనింగ్ ని దక్కించుకుంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమా వీకెండ్ లోపు నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని కూడా షేక్ చేస్తుంది అనుకుంటున్నారు.