Poonam Kaur : నటి పూనమ్ కౌర్ ఎప్పుడు తన ట్వీట్లతో సోషల్ మీడియాలో సంచలనంగా మారుతూనే ఉంది.గతంలో తనను ఇండస్ట్రీలో ఒక టాప్ హీరో వేధించాడని ట్వీట్లు చేసి సంచలనం సృష్టించింది. ఆ టాప్ హీరో వరదలు వచ్చినప్పుడు ఎందుకు ప్రజలను పట్టించుకోవడం లేదని కూడా ప్రశ్నించి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే పూనమ్ కౌర్ ప్రెసెంట్ మళ్లీ ఒక సంచలన ట్వీట్ చేసింది.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక యువతిని ఒక టాప్ డైరెక్టర్ గర్భవతిని చేశాడని ఆరోపించింది. కాగా ఈ విషయంలో మా అసోసియేషన్ జోక్యం చేసుకొని ఆ అమ్మాయికి న్యాయం చేసిందని పేర్కొంది. కానీ ఆమె ఈ విషయంలో ఎవరి పేర్లను చెప్పలేదు. టాప్ డైరెక్టర్ ఎవరు? నష్టపోయిన అమ్మాయి ఎవరు లైంగికంగా వేధింపులకు గురైన అమ్మాయి ఎవరూ అనే విషయం, పూనం బయట పెట్టలేదు.
ఇదే విషయం కాకుండా తనను ఒక రాజకీయ నాయకుడిని అనవసరంగా సోషల్ మీడియాలో బదనం చేస్తున్నారని వాపోయింది. కాగా గతంలో త్రివిక్రమ్ పై నేరుగా విమర్శలు చేసినట్లు వార్తలు వినిపిస్తుండగా ప్రస్తుతం మాత్రం ఆ డైరెక్టర్ పేరు ఎత్తకుండా విమర్శలు చేసింది. దీంతో మళ్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చర్చ జరుగుతోంది. కాస్టింగ్ కౌచ్ గురించి గతంలో శ్రీ రెడ్డి ఒక టాప్ నిర్మాత కొడుకు తనను లైంగికంగా
వేధించి తర్వాత ముఖం చాటేసాడని ఆరోపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ గురించి పోరాటం చేస్తూనే ఉంది.
అయితే ఆ తర్వాత చాలామంది మహిళలు బయటకు వచ్చినా ధైర్యంగా పోరాటం చేయలేకపోయారు. పూనమ్ కౌర్ కూడా సైలెంట్ గానే ట్వీట్లు చేస్తూ ఇలా చిన్నచిన్నగా పోరాటం చేస్తుంది. కానీ ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడేంత శక్తి తమకు లేదని కూడా గతంలో ఒకసారి తెలిపింది. ఇలాంటి లైంగిక ఘటనల నేపథ్యంలో పూనం కౌర్ చేసిన ట్వీట్ ప తెలుగు ఫిలిం ఇండస్ట్రీని కుదిపేస్తుంది. ఆ టాప్ డైరెక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే కాకుండా బయట వ్యక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు.