Virat Kohli : టీ 20 ప్రపంచ కప్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతున్న ఇండియా విరాట్ కొహ్లిపై ఎక్కువ ఆధారపడే అవకాశం ఉంది. ఇప్పటికే టీ 20లో ఇండియా తరఫున 1127 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మొన్నటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్ లో విరాట్ కొహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆరెంజ్ క్యాప్ లో హోల్డర్ గా రూ. 10 లక్షలు కూడా సొంతం చేసుకున్నాడు.
విరాట్ కొహ్లి, రోహిత్ శర్మలకు ఇదే టీ 20 వరల్డ్ కప్ చివరిది కావొచ్చు. వయసు రీత్యా మళ్లీ వచ్చే వరల్డ్ కప్ లో వీరిద్దరూ పాల్గొనకపోవచ్చు. కాబట్టి ఈ సిరీస్ లో ఎలాగైనా రాణించి టైటిల్ కొట్టాలని ఆశిస్తున్నారు. అయితే టీ 20 ల్లో డెత్ ఓవర్లలో ఇప్పటికీ దోని చేసిన పరుగులే ఎక్కువగా ఉన్నాయి. దోనిని దాటాలంటే ఈ సిరీస్ లో 10 పరుగుల చేస్తే చాలు కొహ్లి రికార్డు బద్దలు కొట్టవచ్చు. టీ 20 ప్రపంచకప్ లలో ఇప్పటి వరకు దోని 311 పరుగులు చేశాడు. ఇందుకు దోని 33 మ్యాచులు తీసుకున్నాడు. విరాట్ కొహ్లి మాత్రం 25 మ్యాచుల్లో 302 పరుగులు చేసి మరో 10 పరుగుల దూరంలో ఉన్నాడు.
ఈ ప్రపంచకప్ సమరంలో దోనిని కొహ్లి ఎలాగైన దాటడం సహజమే. టీ 20 వరల్డ్ కప్ డెత్ ఓవర్స్ లో అత్యధిక పరుగులు చేసింది దోనినే. దోని 157.8 స్ట్రైక్ రేట్ తో 311 పరుగులు చేయగా.. విరాట్ కొహ్లి 194 స్ట్రైక్ రేట్ తో 302 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ ఏబీ డివిలియర్స్ 273 పరుగులు, శ్రీలంక ఆల్ రౌండర్ ఎంజెలో మ్యాథ్యూస్ 262 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్ మైక్ హస్సీ 260 పరుగులతో అయిదో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. అయితే ఈ సీజన్ లో ఇందులో విరాట్ కొహ్లి, ఎంజెలో మ్యాథ్యూస్ మాత్రమే ఆడుతున్నారు. వీరిద్దరికి మాత్రమే దోని రికార్డును బద్దలు కొట్టే చాన్స్ ఉంది.