TDP Counter on YCP : ఏపీలో ఎటు చూసినా ఎన్నికల హడావిడే. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వార్ వైసీపీ, టీడీపీ మధ్య జోరుగా సాగుతోంది. ఇక సోషల్ మీడియా ప్రచారం హోరెత్తుతోంది. ట్రోలింగ్ లు, వార్నింగ్ లు, ఎద్దేవాలు, కామెంట్లు..ఇలా బయటి కంటే ఎక్కువ సోషల్ మీడియాలోనే ఎలక్షన్ వార్ నడుస్తోంది. తాజాగా ఏపీలో వైసీపీ జెండా మరోసారి ఎగురబోతోందని ఆ పార్టీ ట్వీట్ చేసింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ సంస్థ ఈ సర్వే నిర్వహించిందని, అందులో వైసీపీకి 135 అసెంబ్లీ, 22 లోక్ సభ స్థానాలు వస్తాయని తెలిపింది. అలాగే ఎన్డీఏ కూటమికి 40 అసెంబ్లీతో పాటు మూడు లోక్ సభ స్థానాలు రానున్నట్లు వెల్లడించింది.
వైసీపీ చేసిన ఈ ట్వీట్ కు టీడీపీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. గేదెల పొదుగుకి మందులు అమ్మే కంపెనీ సర్వే చేసిందా? ఇదేమి సర్వే రా బాబు మీ గన్నవరం గూట్లే చేశాడా? లేక మీ పార్టీ వాళ్లు మొత్తం బుర్రలేని గొర్రెలని ఐప్యాక్ వాడు సలహా ఇచ్చాడా? అని టీడీపీ తన ట్వీట్ లో పేర్కొంది. దీనికి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సంస్థ యాడ్ ఫొటోను కూడా జత చేసింది.
సజ్జల పేరుతో ఏపీలో విడుదలవుతున్నవన్నీ ఫేక్ సర్వేలని వార్తలు వస్తున్నాయి. ఊరు, పేరు లేని సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నాయి. వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా నివేదికలు ఇచ్చేస్తున్నారు. దీంతో కచ్చితత్వం, ప్రామాణికత ఉన్న సర్వే సంస్థలను కూడా అనుమానించాల్సి వస్తోందని అంటున్నారు. గతంలో కొన్ని కంపెనీలు తాము ఎన్ని శాంపిల్స్ తీసుకున్నాం.. వాటిని ఎలా రూపొందించాం.. అనే వివరాలను స్పష్టంగా పేర్కొనేవి. ఇప్పుడు కేవలం ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్స్ లో ఏదో ఒక కంపెనీ పేరు మీద సర్వే రిపోర్ట్ అంటూ విడుదల చేయడం, వాటిని కొందరు అనుసరించడం జరుగుతోంది. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదలయ్యే వరకు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండబోతోంది.