Supreme Court Holidays : స్కూళ్లు, కాలేజీలకే కాదు కోర్టులకు కూడా వేసవి సెలవులు ఉంటాయి. కోర్టు సెలవులు, పని దినాల జాబితా చూస్తుంటే అదృష్టం అంటే అక్కడ పని చేసే వారితే అన్న అభిప్రాయం రాక మానదు. భారతదేశంలోని సుప్రీంకోర్టు న్యాయవ్యవస్థ మెరుగైన పనితీరు మేరకు సంవత్సరానికి 193 మాత్రమే పని చేస్తుంది. అయితే హైకోర్టులు సుమారు 210 రోజులు, ట్రయల్ కోర్టులు 245 రోజులు పనిచేస్తాయి. సర్వీస్ రూల్స్ ప్రకారం తమ క్యాలెండర్లను రూపొందించుకునే అధికారం హైకోర్టులకు ఉంటుంది
2018లో సుప్రీంకోర్టు పనిచేసిన రోజుల సంఖ్య 193. దేశంలోని వివిధ హైకోర్టుల సగటు పనిదినాలు 210. మిగిలిన కోర్టులు 254 రోజుల వరకు పనిచేశాయి. క్రిమినల్ కేసులను పరిష్కరించే జిల్లా, తాలూకా స్థాయి కోర్టులు సెలవుల్లో కూడా పని చేస్తాయి. అయితే, మునుపటి కేసులకు కొత్త విచారణ తేదీలు ప్రకటించబడవు. బెయిల్ అభ్యర్థనలు, ఇతరత్రా అవసరమైన అంశాలను మాత్రమే పరిష్కరిస్తాయి. కోర్టులు మినహా మరే ఇతర ప్రభుత్వ శాఖలకు ఈ స్థాయి సెలవులు లేవు. అందుకే, ఈ విషయం పై ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉంటుంది. సామాన్యులకు న్యాయం జరగడంలో జాప్యానికి ఈ సెలవులే కారణమని కొందరి వాదన. 2018 వరకు ఉన్న గణాంకాల ప్రకారం, భారతదేశంలోని కోర్టులలో 3.3 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సెలవుల కారణంగా ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టులకు ఇన్ని రోజులు ఎందుకు సెలవులు అనే ప్రశ్న తలెత్తుతోంది.