Supreme Court : మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ)లోని సెక్షన్ 50 కింద సమన్లు పొందిన వ్యక్తి మనీలాండ రింగ్ విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను గౌరవించాలని , ప్రతిస్పందించాలని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది.
పిఎంఎల్ఏ కింద విచారణకు అనుగుణంగా అవసరమైతే ఈడీ పిలిస్తే సమన్లు పొందిన వ్యక్తి తప్పనిస రిగా హాజరుకావా లని జస్టిస్ బేలా ఎం త్రి వే ది, జస్టిస్ పంకజ్ మిథాల్ లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. పలు కేసుల్లో ప్రజాప్రతినిధులు ఈడీ ఇచ్చే సమన్ల ను పట్టించుకున్న సందర్బాలు చాలా తక్కువగానే ఉన్నాయి.
ఇప్పుడు విచారణకు రాలేము మళ్లీ కలుస్తాం అంటూ ఇప్పటి వరకు చెబుతూ వచ్చారు. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు చూస్తే సాకులు చెప్పకుండా తప్పకుండా ఈడీ సమన్లకు సమాదానం ఇస్తూ విచారణకు హాజరుకావాల్సిందేనని అర్థం అవుతుంది.