NTR : సింపుల్ గా తన జీవితాన్ని గడిపిన ఎన్టీఆర్ కొడుకుల కథ..
NTR : ఢిల్లీకి రాజైనా ఆ తల్లికి కొడుకే అన్నట్టు.. తెలుగు వారి ఆరాధ్య దైవమైన మాజీ సీఎం ఎన్టీఆర్ కు కొడుకులు అయినా కూడా ఎక్కడా ఆ డాబు దర్పాన్ని ప్రదర్శించకుండా సామాన్య జీవనాన్ని గడిపారు. అవును మన అన్న నందమూరి తారకరామారావు అప్పట్లో సీఎంగా ఉన్న రోజులు అవి. ఆయన సీఎంగా ఉండగా కూడా తన పిల్లలను సాధారణ పౌరులు లాగానే బయట ప్రపంచంలోకి పంపి అన్న గారు ఆదర్శంగా నిలిచారు.
ఎన్టీఆర్ కుమారులు కూడా మా నాన్న ఈ రాష్ట్రానికి సీఎం అంటూ ఎక్కడా ఆ డాబు దర్పాన్ని ప్రదర్శించలేదు. పిల్లలెవరికీ తండ్రి పేరు చెప్పుకుని లబ్ధి పొందడమనే ప్రసక్తే ఉండేది కాదు.
ఎన్టీఆర్ కుమారుడికి జరిగిన ఓ సంఘటన చూస్తే ఇదే అర్థమవుతుంది. ఓసారి ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ(జూనియర్) ముషీరాబాద్ లో తన స్కూటర్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారట. ‘నో పార్కింగ్… అన్నచోట పార్కింగ్ చేశావు. బండికి తాళం కూడా వేయవా’… అంటూ దురు సుగా మాట్లాడి పోలీసులు చలానా కట్టమన్నారట.
చలానా రాస్తూ తండ్రి పేరు అడిగితే… ఎన్టీ రామారావు అని చెప్పారట, ఏం చేస్తారని అడిగితే సీఎం అని బదులిచ్చారట. తర్వాత ‘పొరపాటైంది, బండి పట్టు కుపోండ’ని చెప్పినా… రామకృష్ణ మాత్రం చలానా కట్టి మరీ వచ్చారట. అదీ సీఎం కొడుకు అయినా కూడా సింపుల్ గా తన జీవితాన్ని గడిపిన ఎన్టీఆర్ కొడుకుల కథ..