Bandar : బందరు టౌన్ ప్లానింగ్ : ఓ కలెక్టరమ్మ స్పెషల్ కబ్జా కథ
Bandar : అధికారంలో ఉన్న అధికారిణి కబ్జా కారిణిగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీఆర్డీయే స్పెషల్ కలెక్టరమ్మ అవినీతిపై ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలొస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అనుమతితో పని లేకుండా మూడు అంతస్థుల భవనం కట్టించగలదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు ఇళ్ల మధ్య సెట్ బ్యాక్ నిబంధనకు తూట్లు పొడిచి మరీ.. . ఎదుటి ఇంటి గాలిని, వెలుతురునీ నిర్బంధించగలదని… ఇలాంటి దాష్టీకంపై చట్టం తన పని తాను చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. .
ఈమె అధికార విచ్చలవిడి తనానికి ముఖ్య కారకులు మచిలీపట్నం టౌన్ ప్లానింగ్ అధికారులేనని ఆరోపణలు వస్తున్నాయి.. వీరిని పట్టించుకోని కమిషనరే. ఈ ఘాతుకానికి ప్రధాన ముద్దాయిలు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. మచిలీపట్నం టౌన్ ప్లానింగ్ అధికారులు చేతికి అందిన ముడుపులతో కళ్లకు నోట్ల గంతలు కట్టుకుని కళ్లముందే కబ్జాకోరుకు వత్తాసు పలకుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఆమె ఓ విశ్రాంత మెడికల్ ఆఫీసర్. మల్కాపట్నం డోరు నెం.30/212 ఇల్లు నివాసం. తన ఉద్యోగ విరమణతో ప్రభుత్వం నుంచి పొందిన గ్రాడ్యూటీ, పీఎఫ్ సొమ్ముతో ముస్తాఖాన్ పేటలో డో.నెం. 30/542-ఎ లోని ఇంటిని 2014 ఆగస్టు 27న తన కుమార్తె –పేరున కొనుగోలు చేశారు. ఈ ఆస్తిలో 395 అడుగుల విస్తీర్ణంలో డాబా ఇల్లు ఉంది. ఇంటి చుట్టూ 3 వైపుల ప్రహరీ గోడలు ఉన్నాయి. పడమర రాజవీధి కలదు. ఈ ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు యజమాని కొలతలు వేసి కొనుగోలు చేశారు. ఈ ఆస్తికి దక్షిణం వైపు దురక రాహేలమ్మ ప్రహరీ గోడ ఉంది. 2019లో భారీ వర్షంతో ఈ గోడ కూలిపోయింది. ఈ త్రోవలో గోడ కట్టుకుంటానని బురక రాజకుమారి కోరినందున దోవారి ధనలక్ష్మీ అంగీకరించారు. ఆ తరువాత ధనలక్ష్మీ అల్లుడు కె.జాషువా ఆరోగ్యం క్షీణించటంతో 2024 నవంబర్ 22న కుటుంబ సభ్యులందరూ గుంటూరు ఆసుపత్రికి వెళ్లి జాసువాను జాయిన్ చేసి వైద్యం చేయిస్తుండగా.. 2024 నవంబర్ 29న 3 అడుగులు ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టారు. వెంటనే ఈ కుటుంబ సభ్యులు వచ్చి ఇదేం పని .. ఇలా స్థలం ఆక్రమిస్తారా? అని ప్రశ్నిస్తే.. ఇక రాజకుమారి రెచ్చిపోయారు. రెండు ఇళ్ల మధ్యమూడు అడుగుల స్థలాన్ని ఆక్రమించటమే కాదు.. గాలి, వెలుతురు లేని రీతిలో భారీ గోడను కట్టేసింది. ఇదేమని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోవాలని ఆర్డర్ వేసింది.
టైన్ ప్లానింగ్ లేకుండా మూడంతస్తుల భవనం నిర్మించిన సీఆర్డీయే స్పెషల్ కలెక్టర్ దా?? సెట్ బ్యాక్ లేకుండా ఎదుటి ఇంటి స్థలాన్ని ఆక్రమించటమే రాజసమా? ఈ తంతుకు ఎలాంటి అనుమతులు లేవని తెలిసినా?.. కళ్లప్పగించి.. పళ్లిగిలిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులదా? అయ్యా ఈ సమస్య పరిష్కరించూ అని గోడు పెట్టుకున్నా చలించని ముడ అధికారులదా? రేపో మాపో రిటైర్ కానున్న ఈ స్పెషల్ కలెక్టర్ .. స్పెషల్ కబ్జాను ఇలా వదిలితే.. ఈ వ్యవస్థే ప్రశ్నార్థకం కావటం తథ్యమని జనాలు ఆరోపిస్తున్నారు..