JAISW News Telugu

Mahesh Bhatt : పబ్లిసిటీ కోసం క్రేజీ హీరోయిన్ ని చంపేసిన స్టార్ నిర్మాత!

The star producer who killed the crazy heroine

The star producer who killed the crazy heroine

Mahesh Bhatt : ఈమధ్య కాలం లో టాప్ సెలెబ్రెటీలకు పబ్లిసిటీ అనే ఫోబియా సోకింది. తమ గురించి సోషల్ మీడియా మొత్తం మాట్లాడుకోవాలి అనే లక్ష్యం తో తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారు. రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఇంస్టాగ్రామ్ లో చనిపోయినట్టు ఒక పోస్టుని తన మ్యానేజర్ చేత వేయించింది. అందరూ ఆమె నిజంగా చనిపోయింది అని అనుకొని చాలా బాధపడ్డారు.

ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థన కూడా చేసారు. కానీ ఆమె మరుసటి రోజు తాను చనిపోలేదని సర్వైవల్ క్యాన్సర్ మీద అవగాహన పెంచేందుకే ఈ నాటకం ఆడాను అంటూ చెప్పుకొచ్చింది. సర్వైవల్ క్యాన్సర్ మీద అవగాహన కలిపించాలంటే దానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ వాటిని అనుసరించకుండా ఆమె కేవలం పబ్లిసిటీ పిచ్చి తో చేసిన ఈ చర్యని చాలా మంది తప్పుబట్టారు. ఆమె పై పోలీస్ కేసు కూడా నమోదు చేశారు.

ఇదంతా పక్కన పెడితే గతం లో ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ (అలియా భట్) తండ్రి కూడా ఇలాంటి చీప్ పబ్లిసిటీ ఒకటి చేసాడు. అప్పట్లో ఆయన అక్కినేని నాగార్జున తో కలిసి ‘క్రిమినల్’ అనే చిత్రాన్ని చేసాడు. ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం అప్పట్లో ఆయన హీరోయిన్ మనీష కొయిరాలా చనిపోయినట్టుగా పత్రిక ప్రకటన వేయించాడు. అప్పట్లో మనీషా కొయిరాలా కి క్రేజ్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు. ఆమె చనిపోయింది అనే వార్త వినగానే అప్పట్లో అభిమానులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. ఆ తర్వాత పక్కన రోజు మహేష్ భట్ అది కేవలం సినిమా కోసం చేసిన ఒక పబ్లిసిటీ స్టంట్ అని చెప్పడం తో మనీష కొయిరాలా ఫ్యాన్స్ మహేష్ భట్ పై దాడి చేసే రేంజ్ లో మండిపడ్డారు.

అప్పట్లో మహేష్ భట్ అభిమానుల తాకిడి ని తట్టుకోలేక  పోలీస్ సెక్యూరిటీ ని కూడా ఆశ్రయించాడు. సినిమాలో కంటెంట్ ఉంటే ఎలాగైనా ఆడుతుంది, కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ చెయ్యడం వల్ల కేవలం ఆ నిమిషం వరకు పబ్లిసిటీ వస్తుంది కానీ, దాని వల్ల టిక్కెట్లు అమ్ముడుపోవడం వంటివి మాత్రం జరగదు. క్రిమినల్ సినిమాకి ఆ రేంజ్ లో పబ్లిసిటీ చేసినా కూడా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత నాగార్జున కూడా మళ్ళీ మహేష్ భట్ తో సినిమా చెయ్యలేదు.

Exit mobile version