Ram Charan : #RRR చిత్రం తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గా ఎలాంటి ఫేమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడో మన అందరికీ తెలిసిందే. ఆయన సినిమా కోసం ఇక నుండి ఇండియన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తారు. అలాంటి స్టార్ సినిమాలో చిన్న పాత్ర దొరికినా అదృష్టం లాగ భావిస్తుంటారు హీరోయిన్లు మరియు ఇతర నటీనటులు.
ఇప్పుడైతే ప్రతీ ఒక్కరు రామ్ చరణ్ తో నటించడానికి ఎగబడతారు కానీ, ఒకప్పుడు మాత్రం ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రామ్ చరణ్ ని చాలా తీవ్రంగా అవమానించింది అట. అసలు విషయం లోకి వెళ్తే ‘మగధీర’ చిత్రం తర్వాత రామ్ చరణ్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఫేమ్ వచ్చింది. అలాంటి టైం లోనే ఆయనకీ బాలీవుడ్ లో పలు ఆఫర్లు వచ్చాయి. వాటిల్లో ఆయన అమితాబ్ బచ్చన్ పాత బ్లాక్ బస్టర్ హిట్ సినిమా జంజీర్ ని ఎంచుకొని రీమేక్ చేసాడు.
అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రియాంక చోప్రా కంటే ముందుగా, మేకర్స్ అప్పట్లో మంచి ట్రెండ్ లో ఉన్న దీపికా పదుకొనే ని అడిగారట. అప్పట్లో కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ కి మన సౌత్ స్టార్స్ అంటే చాలా చులకన భావం ఉండేది. వారిలో దీపికా పదుకొనే కూడా ఒకరు. ఆమెని రామ్ చరణ్ సరసన జంజీర్ చిత్రం కోసం అడగగా, ఆమె క్షణం కూడా ఆలోచించకుండా నో చెప్పేసిందట. సౌత్ హీరో తో సినిమా చేయడమా, నువ్వు ఎంత డబ్బులిచ్చినా నేను అతనితో చెయ్యను అని చాలా పొగరుగా సమాధానం చెప్పిందట దీపికా పదుకొనే.
ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అప్పట్లో అలా ఉన్న దీపికా పదుకొనే కి, ఇప్పుడు టాలీవుడ్ హీరోలు తప్ప వేరేవాళ్లు అవకాశాలు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ తో కల్కీ చిత్రం లో నటిస్తున్న ఆమె, అతి త్వరలోనే రామ్ చరణ్ సినిమాలో అవకాశం వస్తే చేస్తాను అని చెప్పుకొచ్చింది. ఇంతకు మించిన విజయం ఇంకెక్కడా ఉంటుంది అంటూ సోషల్ మీడియా ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.