star bowler :: మూడో టెస్టులో టీమిండియా స్టార్ బౌలర్ కు విశ్రాంతి

star bowler

star bowler

star bowler : భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలుపొందిన కివీస్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు సిరీస్‌లోని చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. టాస్ గెలిచిన కివీ జట్టు కెప్టెన్ టామ్ లాథమ్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఆడే  ప్లేయర్లలో ఇరు జట్లలో  చాలా మార్పులు జరిగాయి. కివీస్ జట్టును   గత మ్యాచ్‌లో విన్నర్ గా నిలబెట్టిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ను ఈ మ్యాచ్ లో తీసుకోలేదు.

జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్‌ ..

ముంబై టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా జట్టులో  స్టార్ బౌలర్ కు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్‌లో మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ ను టీమ్ లోకి తీసుకున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా  ను పక్కన పెట్టడానికి గల కారణాన్ని టాస్ సమయంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. అతని ఆరోగ్యం బాగా లేదని, అతని స్థానంలో సిరాజ్‌ను జట్టులోకి తీసుకున్నామని వెల్లడించారు.  అదే సమయంలో, బుమ్రా గురించి బీసీసీఐ కూడా సమాచారం ఇచ్చింది. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్‌కు బుమ్రా ను తీసుకోలేదు. తొలి 2 టెస్టు మ్యాచ్‌లలో ఓటమి పై రోహిత్ మాట్లాడారు. గతంలో జరిగిన వాటిపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదని, అత్యుత్తమ ఆటను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తామని వెల్లడించాడు.

ముంబై టెస్ట్ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ జట్టు 11 ప్లేయర్లలో రెండు ప్రధాన మార్పులు చేసింది. గత మ్యాచ్‌లో బౌలింగ్ రాణించిన లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్‌ను తీసుకోలేదు. అలాగే టిమ్ సౌతీ కూడా ఆడడడం లేదుు. వీరిద్దరి స్థానంలో కివీస్ తుది జట్టులో ఇష్ సోధి, మాట్ హెన్రీలకు అవకాశం ఇచ్చింది.

TAGS