Srivari Laddu : సుప్రీంకోర్టుకు చేరిన శ్రీవారి లడ్డు వివాదం

Srivari Laddu Issue
Srivari Laddu : తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లు వేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు జరపాలంటూ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. కల్తీ నెయ్యి అంశంలో ఆధారాలు లేకుండా చంద్రబాబు ఆరోపణలు చేశారని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్నారు. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డు వ్యవహారంలో విచారణ కోరుతూ వేసిన పిటిష్ లో రిటైర్డు జడ్జి లేదా నిపుణులతో ఎంక్వైరీ జరపాలని కోరారు.
టీటీడీ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఇతర వస్తువులతో కల్తీ చేశారని చంద్రబాబు చేసిన నిరాధార ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు తన నిరాధార ఆరోపణలతో భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నారని, దీనిపై తక్షణమే విచారణకు ఆదేశించేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు.