spot movie : జూన్ 24 న ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహాలో విడుదలైన స్పాట్ మూవీ సరికొత్త కథాంశంతో దూసుకుపోతుంది. విగ్నేశ్ కార్తీక్ దర్శకత్వం వహించగా.. అనేక మంది యువ నటులు నటించారు. నిర్మాతలుగా కేజే బాలమణితో పాటు మరో ముగ్గురు తెలుగు వారు ఉండటం విశేషం. తమిళంలో విడుదలై మంచి టాక్ అందుకున్న ఈ మూవీని తెలుగులో కూడా మంచి డబ్బింగ్ మిగతా విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో అవుట్ పుట్ బాగా వచ్చింది.
సినిమాలో ఓ ప్రముఖ నిర్మాత కేజే బాలమణి మర్బన్ ఒక మంచి మూవీ తీయాలని అనుకుంటాడు. మంచి కథల కోసం చూస్తుంటాడు. ఎక్కడా మంచి కథ దొరకదు. చివరకు విగ్నేష్ కార్తీక్ వచ్చి ఒక కథ ఉంది చెబుతాను అంటాడు. అప్పుడు నిర్మాత కేవలం 10 నిమిషాలే సమయం ఇస్తున్నాను. అంతలోనే చెప్పాలి అని ఆదేశిస్తాడు. విగ్నేష్ కార్తీక్ (మహమ్మద్ షమీ) కథ చెప్పడం ప్రారంభిస్తాడు.
ఒక యువజంటకు పెళ్లి అవుతుంది. పెళ్లయిన తర్వాత అబ్బాయి అమ్మాయి గా మారుతారు. దీంతో కథ ఇంట్రస్టింగ్ గా మారుతుంది.ఇక్కడి నుంచి మరో మూడు కథలు సినిమాలో అరంగ్రేటం చేస్తాయి. ఈ మూడు కథల్లో రెండు బోల్డ్ గా ఉండగా.. మంచి లైఫ్ గురించి ఎలా ఉండాలో చెబుతారు.
ఒకే సినిమాలో మూడు నాలుగు కథలు కనిపించడం రెండో తరహా మూవీలనే ఆంథాలజిస్ అంటారు. అయితే వెబ్ సిరీస్ తరహాలో ఈ మూవీ ఉందని అంటున్నారు. ఈ జెనరేషన్ పిల్లల విషయంలో కఠువు గానే చూపించారు. కానీ ఎవరూ ఒప్పుకోని నిజాలనే చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశాడు. తెలిసీ తెలియని వయసులో పిల్లలు చేస్తున్న పొరపాట్లు, తల్లిదండ్రుల భాద్యతా రాహిత్యాన్ని ప్రశ్నిస్తుంది. మూడో స్టోరీ కొంచెం సాగదీసినట్టుగా కనిపిస్తుంది. అయిదో స్టోరీలో పిల్లలు, రెండు స్టోరీలు బోల్డ్ గా కనిపించేలా చేశారు. విగ్నేష్ కార్తీక్, 96 ఫేమ్ గౌరీ కిషన్, అమ్ము అభిరాం, సోఫియా తదితరులు నటించారు.