Karthika Vanabhojanalu : కార్తీక మాసంలో వనభోజనాల విశిష్టత ఏంటో తెలుసా?
Karthika Vanabhojanalu : మన హిందూ మతంలో దేవుళ్లను కొలవడానికి ప్రాధాన్యం ఇస్తుంటాం. ఇందులో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. ఈనెలలో శివకేశవులను కొలిచి మొక్కులు చెల్లించుకుంటారు. వనభోజనాలు చేస్తూ ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతారు. స్వామి వారికి అభిషేకం నిర్వహించి కూరగాయలతో వంటలు చేసుకుని ఆరగిస్తారు. కుటుంబ సమేతంగా అరిటాకులో భోజనాలు చేస్తూ సందడిగా చేస్తారు.
కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం సంప్రదాయం. దేవాలయ ప్రాంగణంలో ఉన్న చెట్టు కింద వంటలు చేసుకుని అక్కడే పిల్లలు, పెద్దలు అందరు కలిసి భోజనం చేసి సరదాగా గడుపుతారు. దీంతో విష్ణు మూర్తిని కొలవడం వల్ల మన పాపాలు తొలగిపోతాయని చెబుతారు. పురాణాల ప్రకారం ఈ సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇలా చేయడం వల్ల మనకు ఎంతో హాయి కలుగుతుంది.
కార్తీక మాసంలో వనభోజనాలు చేయడం వల్ల మనలో భక్తిభావం పెరుగుతుంది. వనభోజనాల వల్ల మనలో ఐక్యత పెరుగుతుంది. దేవాలయంలోని ఉసిరి చెట్టు కింద ఈ భోజనాలు చేయడం ఇంకా మంచిది. ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ కాలంలో ఉసిరిని విరివిగా తినొచ్చు. దీని వల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఇలా మనకు కలిగే లాభాల నేపథ్యంలో కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజించడం వాటి కాయలను తినడం కూడా మనకు ప్రయోజనం కలిగిస్తుంది. సనాతన సంప్రదాయం ప్రకారం కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈనెలలో నదీస్నానం తప్పకుండా చేయాలి. దీంతో మనకు పుణ్యం కలుగుతుందని వేదాలు చెబుతున్నాయి. కార్తీక మాస విశిష్టతను తెలుసుకుని మసలుకుంటే మనకు ఎంతో మేలు.