TS Assembly:రాష్ట్ర విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది:భట్టి
TS Assembly:ఇవాళ అసెంబ్లీలో సమావేశాల్లోనూ వాడీవేడిగా చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా, ఉత్పత్తి గురించి తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పురోగతిలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి, వ్యవసాయ రంగం పురోగతికి నమ్మకమైన విద్యుత్ సరఫరానే వెన్నముక అని భట్టి అన్నారు. రవాణా, సమాచార రంగాలకు మనుగడకు విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమని తెలిపారు.
రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవనశైలి సూచించేది కూడా విద్యుతేనని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న భట్టి.. డిస్కంలు ద్వారా వచ్చిన నష్టాలు రూ.62,461 కోట్లు అని తెలిపారు. 31 అక్టోబర్ 2023 నాటికి విద్యుత్ రంగం అప్పులు రూ.85,516 కోట్లు అయ్యాయని అన్నారు. డిస్కంలకు వివిధ శాఖల నుంచి రూ.28,673 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు.
డిస్కంలు ద్వారా వచ్చిన నష్టాలు రూ.62,461 కోట్లు అని తెలిపారు. 31 అక్టోబర్ 2023 నాటికి విద్యుత్ రంగం అప్పులు రూ.85,516 కోట్లు అయ్యాయని అన్నారు. డిస్కంలకు వివిధ శాఖల నుంచి రూ.28,673 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వివరాలను ప్రజలకు వివరించడంతో పాటు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని భట్టి వివరించారు.