AP News : బిహార్ కన్నా దారుణంగా ఏపీ పరిస్థితి..ఇప్పుడే ఇలా ఉంటే ఫలితాల రోజున..?

AP News

AP News

AP News : అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు జరిగినా.. ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయని అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఎన్నికలు ముగిసినా తర్వాత అక్కడ అరాచకం రాజ్యమేలుతోంది. ప్రస్తుతం ఏపీ అట్టుడికిపోతోంది. ఎప్పుడు, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని ఆందోళన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలను సినిమాలో చూడడం తప్ప ప్రత్యక్షంగా చూడని ఈ జనరేషన్ .. ఇప్పుడు జరుగుతున్న దాడులను  చూసి భీతిల్లిపోతున్నారు. కర్రలు, రాడ్ లు, రాళ్లతో పలు ప్రాంతాలను రక్తసిక్తం చేస్తున్నాయి. మొత్తానికి ఏపీలోని పలు ప్రాంతాలు యుద్ధభూమిని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడిపోతున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత కల్లోల పరిస్థితికి పోలీసులు, వారి నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు వైసీపీ డైరెక్షన్ లో ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న అల్లర్లను నిలువరించకుండా చోద్యం చూశారని.. ఈ నిర్లక్ష్యమే రాష్ట్రంలోని పలు ప్రాంతాలు రణరంగంగా మారడానికి కారణమైందన్న విమర్శలు వస్తున్నాయి.

టీడీపీ-వైసీపీ మధ్య తలెత్తిన ఘర్షణ చినికి చినికి గాలవానలా మారి రాష్ట్రాన్ని రావణ కష్టంలా మార్చింది. అక్కడ పరిస్థితులు చూస్తుంటే బిహార్ కన్నా దారుణంగా మారాయి. సీమలో ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయాలు రాష్ట్రమంతటా విస్తరించాయా? అనే అనుమానం తలెత్తుతోంది. రెండు వర్గాల దాడిలో బలయ్యేది అమాయక జనాలే. ఎవడు రాసింది ఈ రక్తచరిత్ర అంటూ ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులను కంట్రోల్ చేసేందుకు ఈసీ సీరియస్ ఆదేశాలు ఇవ్వడంతో పరిస్థితిలో మార్పు వస్తుందని నమ్మకం కల్గినా..ఎన్నికలయ్యాక గొడవలకు, ఫలితాల రోజున జరుగబోయే గొడవలకు లింకులు ఉండవా? అంటే కచ్చితంగా ఉండవని చెప్పలేం. ఈ తరహ గొడవలు ఎన్నటికీ మానని గాయంలా నొప్పినిరాజేస్తుంటాయి. వీటన్నంటి నేపథ్యంలో ఏపీలో నెలకొన్న పరిస్థితులతో రాబోయే రోజుల్లో రాష్ట్రం ఎలా మారబోతుందోననే ఆందోళన జనాల్లో కలుగుతోంది.

TAGS