Appireddy and Avinash : టీడీపీ ఆఫీసు పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. జూలై 3న ఈ ఘటనకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మరికొందరి కోసం గాలిస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ ఆఫీసు పై దాడి కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వీరిని గుంటూరుకు చెందిన బత్తుల దేవానంద్, వెంకటరెడ్డి, గిరి రాము, ఖాజా మొయినుద్దీన్, మస్తాన్ వలిగా గుర్తించారు. సీపీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలతో ఆ రోజు దాడికి పాల్పడిన వారిలో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని పోలీసులు జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
అలాగే అధికారం ఉంది కదా అని రెచ్చిపోయిన వైసీపీ నేతలకు టైం దగ్గర పడింది. టీడీపీ ఆఫీసు పై దాడి చేసిన కేసులో లేళ్ల అప్పిరెడ్డితో పాటు దేవినేని అవినాష్, మాజీ ఎంపీ నందిగం సురేష్ ల అరెస్టుకు రంగం సిద్ధమైంది. వారి నేతృత్వంలోనే దాడి జరిగినట్లుగా పోలీసులు ఆధారాలను సేకరించారు. వారి ముఖ్య అనుచరుల్ని నేరుగా టీడీపీ ఆఫీసుకు రాళ్లు, కర్రలతో పంపించారు. దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ రోజున గుంటూరు వైపు నుంచి .. విజయవాడ వైపు నుంచి … మంగళగిరి నుంచి వచ్చిన దుండగలను గుర్తించారు. వారు వచ్చిన వాహనాలు, వారు ఎవరి వద్ద నుంచి ఆదేశాలు తీసుకున్నారో మొత్తం కాల్ లిస్టులు, టోల్ గేట్ వద్ద రికార్డులు తీసుకుని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు.
టీడీపీ ఆఫీసు పై దాడికి పక్కా స్కెచ్ అని తెలుసుకున్నారు. విజయవాడలో పట్టాభిరాం ఇంటిపై దాడి, టీడీపీ ఆఫీసుపై దాడి ఏకకాలంలో జరిగేలా దేవినేని అవినాష్ తన ముఠాను ప్రేరేపించారు. దాడికి గుంటూరు నుంచి తన అనుచరులను లేళ్ల అప్పిరెడ్డి. ఆయన తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తోంది. నందిగం సురేష్ తన అనుచరుల్ని కూడా పంపారు. విధ్వంసం వీడియోలను ఆయన అనుచరులు సురేష్ కు షేర్ చేసినట్లుగా తెలుస్తోంది.
మొత్తంగా అప్పిరెడ్డి, అవినాష్, నందిగం సురేష్ అరెస్టుతో ఆగిపోదని.. వారి ముగ్గురికి తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాలపై ఆరా తీస్తారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి.