Guntur Kaaram : టాలీవుడ్ లో ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్ తారా స్థాయికి చేరుకుంది. కొంతమంది హీరోలు అసలు జనాలు నవ్వుకుంటారేమో వీటిని చూసి అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినా లెక్కలు వేసుకుంటున్నారు. మహేష్ బాబు ఈ విషయం లో ఎప్పుడూ ముందు ఉంటాడు. కచ్చితంగా ఇతను పెద్ద సూపర్ స్టార్, అందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ వచ్చిన కలెక్షన్స్ కంటే కూడా ఇతను చెప్పుకునే కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి.
ఇది మొదటి నుండి జరుగుతూనే ఉంది. సూపర్ హిట్ సినిమాలకు ఎక్కువ కలెక్షన్స్ వేసుకోవడంతో తప్పు లేదు. ఎందుకంటే అది అందరూ చేసేవే. కానీ ఇతను ఫ్లాప్ సినిమాలకు కూడా రికార్డు స్థాయి వసూళ్లను వేసుకుంటున్నాడు. అదంతా చూసాక అసలు ఇంత రికార్డ్స్ పిచ్చి ఏమిటి అని ప్రతీ ఒక్కరికి అనిపించక తప్పదు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాకి మొదటి రోజే వసూళ్లు మొత్తం డ్రాప్ అయ్యాయి.
కానీ కాంబినేషన్ క్రేజ్ అవ్వడంతో మొదటి రోజు సాయంత్రం షోస్ నుండి ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. కానీ రెండవ రోజు నుండి వసూళ్లు దారుణంగా పడిపోయాయి, హనుమాన్ కి వచ్చే ఓవర్ ఫ్లో తో ‘గుంటూరు కారం’ చిత్రాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే పండగ సెలవులు కావడం తో భోగి మరియు సంక్రాంతి పండుగలు వచ్చినప్పుడు కొన్ని చోట్ల మంచి వసూళ్లను రాబట్టింది. ఇదే ఛాన్స్ గా తీసుకొని ఈ సినిమాకి ఇష్టమొచ్చినట్టుగా కలెక్షన్స్ ప్రతీ రోజు వేసుకుంటూ పోతున్నారు. ఉదాహరణకి నిన్న నైజాం ప్రాంతం లో 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్పుకొచ్చారు. కానీ వాస్తవానికి 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. నిజానికి గుంటూరు కారం ప్రస్తుతం నడుస్తున్న షోస్ అన్నీ హౌస్ ఫుల్స్ అయినా కూడా అంత వసూళ్లు రావడం అసాధ్యం.
కానీ మూవీ టీం నోటికి వచ్చిన లెక్కలు వేసుకుంటూ వెళ్తుంది. నిజానికి ఈ సినిమాకి 2 కోట్ల 60 లక్షల రూపాయిల వరకు షేర్ వసూళ్లు సంక్రాంతి పండుగ రోజు వచ్చింది. అలా విడుదలైన రోజు నుండి నేటి వరకు ఈ సినిమాకి కేవలం నైజాం ప్రాంతం నుండి 10 కోట్ల రూపాయిల ఫేక్ కలెక్షన్స్ వేసుకున్నారట. ఇది తెలుగు చలన చిత్ర చరిత్రలోనే మొదటిసారి అని మండిపడుతున్నారు ట్రేడ్ పండితులు.