JAISW News Telugu

Annapurnamma : అర్ధరాత్రి వరకు అదే పని.. ఎయిడ్స్ రాకపోయుంటే: అన్నపూర్ణమ్మ సంచలన వ్యాఖ్యలు

Annapurnamma

Annapurnamma

Annapurnamma : టాలీవుడ్ తో పాటు కోలివుడ్ లో కూడా అన్నపూర్ణమ్మ గురించి పరిచయం అవసరం లేదు. కొన్ని సినిమాల్లో తల్లి, మరికొన్ని సినిమాల్లో బామ్మ పాత్రలు పోషిస్తూ మెప్పు పొందుతుంది. అందరికీ అమ్మగా గుర్తింపు సంపాదించుకున్నారు ఆమె. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే 700కు పైగా సినిమాల్లో.. మూడు తరాలను కవర్ చేశారు అన్నపూర్ణమ్మ.

దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో వచ్చిన ‘స్వర్గం నరకం’ సినిమాలో మోహన్ బాబుకు భార్యగా నటించిన అన్నపూర్ణ.. తర్వాతి కాలంలో తల్లిగా కూడా కనిపించింది. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, సుమన్, రాజేంద్రప్రసాద్ వంటి పెద్ద పెద్ద స్టార్లకు తల్లి పాత్ర పోషించి మెప్పించింది. ఇక, తర్వాతి జనరేషన్ కు బామ్మగా వందల చిత్రాల్లో కనిపించారు. 80 పడిలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. బుల్లితెరపై కూడా కనిపిస్తుంది. జబర్ధస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో కుర్రాళ్లతో పోటీ పడుతోంది.

మేయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా చానళ్లకు అప్పుడప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తి విషయాలను పంచుకుంటుంది. 700కు పైగా సినిమాలు చేసిన అన్నపూర్ణకు ఇండస్ట్రీతో ఉన్న అనుబంధం మరెవరికి ఉంటుంది? ఏ విషయమైనా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆమె స్టయిల్. ఏ ఇంటర్వ్యూ చూసినా లోపల ఒకటి, బయట ఒకటి పెట్టుకున్నట్లు కనిపించదు. అంత ఓపెన్ మైండ్, మొన్న ఆమధ్య పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

తప్పు అనేది ఒక వైపు నుంచే జరగదు. ఇద్దరికీ ఇష్టం ఉండాలి. ప్రతీ రంగంలో మహిళలు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారు.. కానీ, కుటుంబం, పరువు, మర్యాదలు లాంటివి గుర్తుకు వచ్చి ప్రలోభాలకు లొంగకుండా తప్పించుకుంటున్నారు. అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి కష్టాలు తప్పవు.. అన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా నిలబడాలి.

ఇక ఆమె ఏం చెప్పిందంటే.. ‘అప్పట్లో అవకాశాల ఇవ్వాలంటే వేధించేవారు. ఛాన్స్ ఇస్తే మాకేంటి? అని అడిగేవారు. అందుకే 20 ఏళ్లకు పెళ్లి చేసుకొని, 25 ఏళ్లకు తల్లి పాత్రలు పోషించా. ఈ పాత్రలు చేయడం వల్ల వేధింపులు తగ్గాయి. షూటింగ్ కోసం ఎక్కడో తిరిగేవాళ్లం. ఎక్కడో స్టే చేసేవాళ్లం.. ఆ సమయంలో అర్ధరాత్రి 2 గంటలకు కొందరు కక్కుర్తిగాళ్లు మా రూం తలుపులు కొట్టేవారు.

ఎయిడ్స్ వ్యాధి అనేది ప్రారంభమైన తర్వాత ఇండస్ట్రీలో ఇలాంటి ఘటనలు తగ్గాయి. ఎవరికి ఏ రోగం ఉందోనని దగ్గరికి కూడా వచ్చేవాళ్లు కాదు. కొన్ని బాధితులను ఎంత ఇబ్బంది పెడతాయో తెలియదు కానీ.. వాటి వల్ల మంచీ చెడు రెండూ ఉంటాయి.’ అని అన్నపూర్ణమ్మ చెప్పుకచ్చారు. ఇంటర్వ్యూలోనే ఈ పార్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version