Jagan Sarkar : జగన్ సర్కారుకు తలనొప్పిగా మారిన సమ్మెల గోల
Jagan Sarkar : ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జగన్ సర్కారుకు కష్టాలు మొదలయ్యాయి. ఒక పక్క ఉద్యోగుల సమ్మె మరోవైపు పార్టీ నేతల రాజీనామాల పరంపర తలనొప్పిగా మారాయి. గడిచిన నెల రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. 104, 108 ఉద్యోగులు కూడా ఈనెల 23 నుంచి సమ్మె చేయడానికి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో జగన్ సర్కారు భవితవ్యం అడకత్తెరలో చిక్కిన పోకచెక్కలా మారింది.
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న జగన్ ముందు కష్టాలు కనిపిస్తున్నాయి. వన్స్ మోర్ నల్లేరు మీద నడకే అన్నట్లు భావించిన సర్కారుకు అిధికారం అంత సులువు కాదని అర్థమవుతోంది. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులు సమ్మె చేస్తుండటంతో పనులు ముందుకు సాగడం లేదు. ఫలితంగా ఉద్యోగుల తీరు గుదిబండగా తయారయింది.
జగన్ సర్కారుకు నోటీసులు అందజేసి సమ్మె చేస్తామని చెబుతుండటంతో సర్కారు డీజిల్ లేని ఇంజన్ లా తయారయింది. ఉద్యోగులను నియంత్రించలేక నిందలు వేసి నెట్టుకొచ్చినా ప్రస్తుతం ఆ స్టేజీ దాటిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో జగన్ ఆలోచన కార్యరూపం దాలుస్తుందో లేదో తెలియడం లేదు.
జగన్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతోనే ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే వారు సమ్మె చేస్తున్నారు. వీరు రాజీనామాలు ఇస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ఇక ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్ అంధకారమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.