Agnibaan Rocket : అంతరిక్షంలోకి దూసుకెళ్లిన రాకెట్.. ‘అగ్నిబాణ్‌’పై మరిన్ని విషయాలు

Agnibaan Rocket

Agnibaan Rocket

Agnibaan Rocket : ప్రపంచ అంతరిక్ష సంస్థల్లో భారత్ అటెన్షన్ క్రియేట్ చేసింది. ఉపగ్రహాలను వీలైనంత వేగంగా.. తక్కువ ధరలో కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టి సక్సెస్ అయ్యింది. చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్‌ సంస్థ ‘అగ్నిబాణ్‌’ పేరిట సబ్‌-ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ ప్రయోగాన్ని నిర్వహించింది. గురువారం (మే 30) ఉదయం 7.15 గంటలకు దీన్ని టెస్ట్ చేశారు. ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్‌ అగ్నికుల్‌ సంస్థను అభినందించారు. ఈ ప్రయోగం దాదాపు నెలన్నర క్రితమే జరగాల్సింది. కానీ, 4 సార్లు వాయిదా పడి.. ఐదో సారి సక్సెస్ అయ్యింది.

టెస్ట్ సక్సెస్..
ఈ టెస్ట్ ప్రయోగం రెండు నిమిషాలపాటు సింగిల్‌ స్టేజ్‌లోనే జరిగింది. దీనిలో వరల్డ్ లో తొలిసారి తయారు చేసిన సింగిల్‌ పీస్‌ త్రీడీ ప్రింటెడ్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ అమర్చారు. దీనిపై ‘అగ్నికుల్‌ కాస్మోస్‌’కు పేటెంట్‌ ఉంది. ఇది సబ్‌కూల్డ్‌ లిక్విడ్ ఆక్సిజన్‌ ఆధారంగా ఒక స్టేజిలోనే పని చేసింది. ఈ వ్యవస్థను దేశీయంగానే డెవలప్ చేశారు.  

ఈ రాకెట్‌ పొడవు 6.2 మీటర్లు. కొన్ని ప్రత్యేకమైన ఉపగ్రహాలను దీని నుంచి కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చు. దీని ముక్కు భాగం లోపల ఉపగ్రహాన్ని అమరుస్తారు. తొలిసారి ఐథర్‌నెట్‌ ఆధారంగా పనిచేసే ఏవియానిక్స్‌ వ్యవస్థను ఈ రాకెట్‌లో  వాడారు. పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటో పైలెట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ వినియోగించారు.

ప్రయోగం ఒక వేళ అదుపుతప్పితే రాకెట్ ను నాశనం చేసేలా ఇస్రో డెవలప్ చేసిన ఫ్లైట్‌ టర్మినేషన్‌ వ్యవస్థను ఇందులో అమర్చారు. పలురకాల లాంచర్ల నుంచి ప్రయోగించేలా నిర్మించారు. 300 కిలోల కన్నా తక్కువ బరువున్న ఉపగ్రహ ప్రయోగాలకు అవకాశాలు దొరకడం అరుదు. ఇలాంటి వాటి కోసం అగ్నికుల్‌ బాగా పని చేస్తుంది.

తొలి ప్రైవేట్ లాంచ్‌ ప్యాడ్‌పై ప్రయోగం..
‘అగ్నిబాణ్’ ప్రయోగం 2 నిమిషాలు మాత్రమే జరిగింది. ప్రయోగం ముగిశాక రాకెట్‌ సముద్రంలో పడిపోయింది. శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్‌ ఏఎల్‌పీ-01 (ALP-01) ఈ పరీక్షకు వేదికగా మారింది. ఈ రాకెట్‌ ప్రయోగించిన తర్వాత 4 సెకన్లలో నిర్ణీత దిశకు మళ్లింది. 1.29 సెకన్ల సమయానికి ఇది నిర్ధేశిత ప్రదేశానికి చేరి.. అక్కడి నుంచి సముద్రంలో పడింది. అగ్నికుల్‌ ఇంజిన్‌, ఆకారం వాటిని విశ్లేషించి మరింత మెరుగుపర్చేందుకు 2 నిమిషాల పరీక్ష ఉపయోగపడనుంది.

ఈ ప్రయోగం విజయవంతం కావడంపై కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ‘అగ్నికుల్‌’ సంస్థను అభినందించారు. ప్రపంచంలోనే 3డీ ప్రింటెడ్‌ రాకెట్‌ ఇంజిన్‌ను ఇదే కావడం విశేషం అన్నారు.

TAGS