Husband and Wife : భార్యాభర్తల బంధం కలకాలం నిలవాలంటే ఏం చేయాలి?
Husband and Wife : ఈ రోజుల్లో భార్యాభర్తల బంధంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు. చీటికి మాటికి గొడవలకు పోయి దాంపత్యాన్ని పాడు చేసుకుంటున్నారు. పాశ్చాత్యులు సైతం మన వివాహ బంధాన్ని గౌరవిస్తుంటే మనం మాత్రం వారి బాటలో నడుస్తున్నాం. ఈనేపథ్యంలో పెళ్లి సంబంధంపై పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.
ఆలుమగల సంబంధంలో ఎలాంటి బాధలు లేకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ధోరణికి స్వస్తి పలకాలి. ఈ క్రమంలో భార్యాభర్తలు ఎలాంటి బేషజాలకు పోకుండా చూసుకోవాలి. దంపతుల మధ్య అరమరికలు లేకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే సంసారం సజావుగా సాగదు. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
భార్యాభర్తల బంధం కలకాలం నిలవాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. ప్రేమకు నమ్మకం పునాది అనుమానం సమాధి. ఇలా ఆలుమగల జీవనంలో ప్రతి విషయంలో నమ్మకంతో ఉండాలి. ఈ క్రమంలో మొగుడు పెళ్లాలు ముందుకు నడవాలి. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉండాలి. దీంతోనే వారి మనుగడలో విశ్వాసంతో మెలగాలి.
దంపతుల సంసారంలో కలతలు రాకుండా చూసుకోవాలి. ఇద్దరి మధ్య అనురాగం ఆప్యాయతలు ఉండాలి. గొడవలు లేకుండా చూసుకోవాలి. దీంతో ఆలుమగలు సరైన మార్గంలో నడిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఒకరికొకరు కష్ట సుఖాల్లో తోడు నీడగా నిలవాలి. అప్పుడే మనకు ఎలాంటి నష్టాలు రాకుండా ఉంటాయని చూసుకుని ముందుకు నడవడం మంచిది.