Reels : రీల్స్ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. మెడకు ఉరి వేసుకొని సెల్ ఫోన్ లో చిత్రీకరించే క్రమంలో తాడు బిగుసుకు పోవడంతో మృతి చెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం రాత్రి జరిగింది.
నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్ (23) హోటల్ లో పని చేస్తుంటాడు. మొబైల్ తో రీల్స్ చేస్తుంటాడు. మంగళవారం రాత్రి మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు. ఉరి వేసుకుంటూ సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించాలనే ఉద్దేశంతో ఫ్రిజ్ పై సెల్ ఫోన్ ను అమర్చాడు. తర్వాత దూలానికి తాడు తగిలించి మెడకు ఉరి వేసుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఉరి బిగుసుకుపోయి మృతి చెందాడు.
బుధవారం ఉదయం కుటుంబ సభ్యలు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలంలో సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ అజయ్ తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.