Nagamanikantha : బిగ్ బాస్ సీజన్ 8 లో నాగ మణికంఠ విగ్ తీసిన సీన్లు ప్రసారమయ్యాయి. అయితే ఈ సీన్లకు సంబంధించి స్టార్ మా పరివారం 100 ఎపిసోడ్ లో దీపికా రంగరాజన్ అలియాస్ బ్రహ్మ ముడి కావ్య తాను పెట్టుకున్న విగ్గుని కూడా తీసి చూపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే శ్రీముఖి యాంకర్ గా చేస్తున్న స్టార్ మా పరివారం ట్రైలర్ కు సంబంధించి 100వ ఎపిసోడ్ లో ఈ సంఘటన జరిగింది.
దీనికి సంబంధించి అనేక మంది బ్రహ్మముడి కావ్య పై కామెంట్స్ చేశారు. దీంతో నాగ మణికంఠకు బ్రహ్మముడి కావ్య సారీ చెప్పింది. అయితే ఆ సారీ చెప్పిన విధానం కూడా ప్రేక్ష కులకు నచ్చలేదు. ఆమె చెప్పిన విధానం నవ్వుతూ చెప్పిందని ఏ మాత్రం బాధపడకుండా ఉందని తిరిగి ఆమెనే కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో నాగ మణికంఠ తనకు ట్రాన్స్పరెంట్ గా ఉండడం ఇష్టమని సోఫాలో కూర్చొని తాను పెట్టుకున్న విగ్గుని తీసేశాడు. దీంతో అతడి సాధారణ రూపం కనిపించింది. అయితే బిగ్ బాస్ స్టార్ మా లోనే ప్రసారమవుతుంది. స్టార్ మా పరివారం అనే ప్రోగ్రామ్ చేస్తోంది. ఈ రెండు ఒకే మీడియా ఛానల్ అయినా ఒకరిపై మరొకరు కామెంట్లు చేసుకోవడం వింతగా ఉందని అనుకుంటున్నారు. అయితే నాగ మణికంఠ కంటే బ్రహ్మముడి కావ్య చేసిన ధైర్యం గొప్పదని కొంతమంది పొగుడుతున్నారు.
ఒక మహిళ అయి ఉండి ఇలా తాను కూడా విగ్గు పెట్టుకుంటున్నానని ధైర్యంగా చెప్పగలగడం ఆమెకే సాధ్యమైందని అంటున్నారు. మొత్తం మీద నాగ మణికంఠను ఘోరంగా అవమానించిందని ఇలా చేయడం తప్పు అని మరికొందరు భావిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 8లో ఫుల్ ఎమోషనల్ అండ్ సింపతి క్రియేట్ చేసుకున్న వ్యక్తిగా నాగమణికంఠ ఉన్నారు. చివరకు నాగమణికంఠకు దీపిక రంగరాజన్ సారీ చెప్పింది. ఏదైనా తప్పు చేస్తే క్షమించాలని నాగమణికంఠను కావ్య కోరింది.