Israel Settlers : ఇజ్రాయెల్ సెటిలర్లపై అమెరికా ఆంక్షలు విధించింది. పాలస్తీనా వాసులపై పెరుగుతున్న హింస నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇజ్రాయెల్ ను ఆదుకునే క్రమంలో ఇజ్రాయెల్ పౌరులకు రక్షణకల్పించడం తమ బాధ్యతగా అభివర్ణించింది ఇజ్రాయెల్ సెటిలర్లపై ఆర్థిక ఆంక్షలు విధించింది.
పాలస్తీనా వాసులపై హింసాత్మక చర్యలకు పాల్పడటం క్షమించరాని నేరంగా పేర్కొంటోంది. వారి ఆస్తులను ధ్వంసం చేయడం గమనార్హం. దీంతో అమెరికా ఈ మేరకు వారిపై కఠిన ఆంక్షలు విధిస్తోంది. వారి ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు వాటిని లాక్కుంటామని చెప్పడం నేరంగా అభివర్ణించింది. తమ పౌరులను కొంతమంది ఇజ్రాయెల్ సెటిలర్లు చంపేశారని ఆరోపించింది.
దీంతో వారిపై ఆంక్షలు విధించినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్లో మరణాల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో ఇజ్రాయెల్ పై విమర్శలు వస్తున్నాయి. హమాస్ ను అంతమొందించే లక్ష్యంతో సంయమనం పాటించాలని ఇజ్రాయెల్ కు సూచించడం గమనార్హం.
ఇజ్రాయెల్ సైన్యం వెస్ట్ బ్యాంక్ లో దాడులు చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్కడి సెటిలర్లు వారితో కలిసి దాడులకు తెగబడుతున్నారు. దీంతో ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దురాగాతాలను ఎండగడతామని చెబుతున్నారు. వెస్ట్ బ్యాంక్ లో సెటిలర్లు చేస్తున్న హింసాత్మక చర్యలు ఆపుతామని పేర్కొంటున్నారు. వారి చర్యలను అడ్డుకుని పాలస్తీనా వాసులను రక్షించాలని ప్రయత్నిస్తోంది.