Guntur Kaaram : ‘గుంటూరు కారం’కు అసలు టాస్క్ ఇప్పుడే స్ట్రాట్..

Guntur Kaaram

Guntur Kaaram

Guntur Kaaram : మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి అడుగు పెట్టింది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రన్ టైం కొనసాగుతుంది. అయితే సంక్రాంతి హడావుడి చాలా వరకు ముగిసింది. బోగి నుంచి కనుమ వరకు అన్నీ పూర్తయ్యాయి. బోగికి రెండు రోజుల ముందు ఈ మూవీ రిలీజైంది. పండుగ హడావుడి ముగిసి ఎక్కడి వారు అక్కడికి పయనం అవుతున్నారు. రేపటి (జనవరి 18) నుంచి ఉద్యోగాలు మొదలు కాబోతున్నాయి. దీంతో కలెక్షన్లు తగ్గవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సినిమాకు వచ్చిన బజ్, పండుగ, టికెట్ల రేట్ల పెంపు, తదితర కారణాలతో గుంటూరు కారం బడ్జెట్ లో సగం వరకు తిరిగి వచ్చినట్లే.. ఆంధ్ర రూ. 48 కోట్ల మేరకు, నైజాం రూ. 40 కోట్ల మేరకు, సీడెడ్ రూ. 15 కోట్ల మేరకు టికెట్లను విక్రయించారు. ఈ మెత్తాల్లో సగం వరకు రిక‌వరీ అయినట్లే. ఇక మిగిలిన సగం రాబట్టాల్సి ఉంది. అది అంత ఆషామాషీ కాదు. నైజాంలో మరో రూ. 40 కోట్ల మేర వసూళ్లు సాగిస్తే, జీఎస్టీ మిగిలే అవకాశం ఉందట. ఆపై ఖర్చులు, కమిషన్ సంగతి చూడాలి. ఆంధ్ర కూడా ఇదే పరిస్థితి ప్రతి ఏరియాలో సగానికి సగం రాబట్టాలి. కానీ అది అంత ఈజీ టాస్క్ కాదు. ఉత్తరాంధ్ర మరో రూ. 6 కోట్లు రాబట్టాలంటే ఏం చేయాలి? ఇదే పరిస్థితి ప్రతి ఏరియాలో ఉంది.

రేపటి (జనవరి 18) నుంచి మూవీ కలెక్షన్లు తగ్గకుండా వారాంతం వరకు ఆడితే అదృష్టమే. పండుగ తర్వాత అలాంటి లెక్కలు ఉండవు. పైగా థియేటర్లు, టికెట్ రేట్లు తగ్గించడం మొదలవుతుంది. బాగున్న సినిమాకు థియేటర్లు పెరగడం మొదలవుతుంది. ఇన్ని ఈక్వేషన్ల మధ్య గుంటూరు కారం తీరం దాటడం అంత ఈజీ టాస్క్ కాదు. పైగా నిర్మాత పాతిక కోట్ల మేరకు జీఎస్టీలే వెనక్కు ఇచ్చుకోవాలి. విడుదల నాటికే ఆంధ్రలో రూ. 4 కోట్లు, నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్ రూ. 2 కోట్ల మేరకు తక్కువకు ఇవ్వాల్సివచ్చింది. ఆ 11 కోట్లకు ఈ జీఎస్టీ అదనం. ఇంత క్రేజీ ప్రాజెక్ట్ చేసి, ఏమీ మిగలకపోగా, ఫ్లాపు సినిమా అన్నది బ్యానర్ ప్రొఫైల్ లో యాడ్ కావడం బ్యాడ్ లక్ కాదా?

TAGS