Economic Recession : మాంద్యం అంటే నెమ్మదించడం లేదా దీర్ఘకాలం పాటు అదే స్థితిలో ఉండిపోవడం. ఆర్థిక పరమైన విషయాల్లో దీన్నే ఆర్థిక మందగమనంగా చెబుతారు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘ కాలంపాటు మందగమనంలో ఉన్నా లేదా వృద్ధిరేటు పడిపోయినా ఆర్థిక మాంద్యంగా చెబుతారు. భారత్ లో ఆర్థిక మాంద్యం కొనసాగుతోందన్న వార్తలను గతంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. అసలు అలాంటి సందేహాలు అవసరమే లేదని ఆమె అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా మాంద్యం సంభావ్యత ను ఫ్రాంక్లిన్ టెంపుల్టెన్ ఈ ఏడాది ఫిబ్రవరి 21న ప్రకటించింది. దాని ప్రకారం వివిధ దేశాల మాంద్యం సంభావ్యతను ఇలా ఉంది.
జర్మనీ: 73 శాతం
ఇటలీ: 65 శాతం
యూకే : 53శాతం
న్యూజిలాండ్ : 50 శాతం
కెనడా : 50 శాతం
యూఎస్ : 45 శాతం
ఆస్ట్రేలియా : 40 శాతం
ఫ్రాన్స్ : 35 శాతం
సౌతాఫ్రికా : 30 శాతం
మెక్సికో : 25 శాతం
స్విట్జర్లాండ్ : 20 శాతం
స్పెయిన్ : 15 శాతం
జపాన్ : 15 శాతం
సౌత్ కొరియా : 15 శాతం
చైనా : 15 శాతం
బ్రెజిల్ : 10 శాతం
సౌదీ అరేబియా : 10 శాతం
ఇండోనేషియా : 2 శాతం
ఇండియా : 0 శాతం
మాంద్యం యొక్క మధ్యస్థ అంచనా సంభావ్యతను ప్రదర్శిస్తుంది. బ్లూమ్ బర్గ్ నిర్వహించిన తాజా నెలవారీ, త్రైమాసిక సర్వేలు మరియు వివిధ బ్యాంకులు సమర్పించిన అంచనాల నుంచి ఈ అంచనాలు తీసుకోబడ్డాయి. ఈ నివేదిక ప్రకారం భారత్ లో మాంద్యం జీరో శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది.