KCR : ఇంకా కేసీఆర్ ను వదలని ప్రధాని కలలు..

KCR

KCR

KCR : తెలుగుతో ఒక సామెత ఉంది అదేంటంటే.. ‘చింత చచ్చినా పులుపు చావలేదు’. ఈ సామెత అచ్చంగా కేసీఆర్ కు సూట్ అవుతుందని చెప్పవచ్చు. పార్టీ అధికారానికి దూరమైన దాదాపు ఐదు నెలలు దాటింది. రాష్ట్రంలో పార్టీ పూర్తిగా ఆదరణ తగ్గిందని సర్వేలు చెప్తున్నాయి. ఎంపీ స్థానల్లో నిలబెట్టేందుకు సరైన అభ్యర్థులు దొరకలేదు. ప్రకటించిన (కావ్య) వారు కూడా బహిరంగ లేఖ రాసి మరీ పార్టీని వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఇంత జరుగుతున్నా.. తనకు మాత్రం ప్రధాని కలలు వస్తున్నాయని చెప్తున్నారు. కనీసం ఒక్క ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేయని కేసీఆర్ 12 సీట్లు ఇస్తే తాను ప్రధాని అవుతానంటూ ప్రచారం చేయడం నిజంగా హాస్యాస్పందంగా మారింది.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికీ ఉపఎన్నికల్లో ఓటమి బాధలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేందుకు ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని ఆయన అప్పుడప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకున్నారు.

తాను ప్రధాని రేసులో ఎందుకు ఉండకూడదని కేసీఆర్ మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. అవకాశం వస్తే అందుకు సంతోషిస్తాను. ఆ అవకాశాన్ని ఎవరు అందిపుచ్చుకోరు. అని కేసీఆర్ అన్నారు. తనకు ఇప్పటికీ జాతీయ రాజకీయాల కలలు ఉన్నాయని, ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటానని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఆత్మ విశ్వాసాన్ని, ఉద్దేశాన్ని బీఆర్ఎస్ మద్దతుదారులు తప్పుపట్టకున్నా.. ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో కనీసం పోటీ చేయకుండా, అధికారం నుంచి దిగివచ్చిన తర్వాత తనను ప్రధాని అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి కేసీఆర్ సాహసం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

మొత్తం మీద టీఆర్ ఎస్ పార్టీ పలు సర్వేల ప్రకారం 1-2 సీట్లకు మించదని అంచనా వేస్తున్న తరుణంలో కేసీఆర్ తనను తాను ప్రధానిగా ప్రొజెక్ట్ చేసుకోవడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. ఆశావహంగా ఉండటం ఒకటే కానీ కేసీఆర్ ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదని సోషల్ మీడియా ట్రాకర్ ఒకరు వ్యాఖ్యానించారు.

TAGS