Congress MLA Watch : కాంగ్రెస్ ఎమ్మెల్యే వాచ్ ధర ఎంతో తెలుసా? మైండ్ బ్లాంక్ అయిపోవాల్సిందే!

Congress MLA watch

Congress MLA watch

Congress MLA Watch Price : సంపన్నులకు విలాసవంతంగా జీవించడమంటే ఎంతో ఇష్టం. కొందరు పదేసి కార్లు ఉన్నా మరో కంపెనీ ఏదన్నా హై రేంజ్ కారు తీసుకొస్తే చాలు దాన్ని కూడా కొని పారేస్తారు. అలాగే ఖరీదైన విల్లాలు, బంగ్లాలు కొంటూనే ఉంటారు. సంపన్నులకు ఓ రకంగా డబ్బులు చెట్లకు కాసినట్టే అనుకోవాలి. ఎందుకంటే పేదవాడు వంద రూపాయలు సంపాదించాలంటే రోజంతా పనిచేయాలి. అదే ధనవంతులకు
సంపాదన అనేది ఒక ఆట. వారేం చేసినా పైసలు వస్తూనే ఉంటాయి. అదంతా ఎందుకు విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క ఫొటో పెడితే కోట్ల రూపాయలు వస్తాయి. ఇలా సంపాదన పలు మార్గాల్లో వారికి వచ్చిపడుతుంది. దీంతో వారు తాగే నీళ్ల నుంచి ధరించే వాచి వరకు విలువైనవే ఉంటాయి.

తాజాగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ధరించిన వాచిపై అందరి దృష్టి పడింది. ఈయన ఎవరో మీకు తెలిసి ఉంటుంది. సీనియర్ నేత మైనంపల్లి హన్మంతరావు తనయుడు. రోహిత్ డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో  మెదక్ లో సామాజిక సేవ కార్యక్రమాలు, పలు వ్యాపారాలు చేస్తుంటారు. అలాగే మెదక్ లో రాజకీయ నాయకుడిగా పనిచేసి మొన్నటి ఎన్నికల్లో 25 ఏండ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన బీఆర్ఎస్ నాయకురాలు పద్మా దేవేందర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు.

ఇక మైనంపల్లి రోహిత్ తన తండ్రిలాగా దూకుడు ఎక్కువే. తండ్రి చాలా సీనియర్ నేత కావడంతో వేలకోట్ల ఆస్తులు ఉన్నాయనే చెప్పాలి. మైనంపల్లిని ప్రత్యర్థులు పెద్దా గూండా, కబ్జాకోరు అని కూడా విమర్శిస్తుంటారు. అయినా వాటిని ఆయన పెద్దగా పట్టించుకోరు. ఇక మైనంపల్లి రోహిత్ యువకుడే కనుక ఆయనపై పెద్దగా ఆరోపణలు లేకపోయినా.. ఆయన విలాసవంత వైఖరితో వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన అసెంబ్లీకి, సచివాలయానికి అత్యంత అధునాతన, విలాసవంత కార్లలో వస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నారు. అలాగే ఈమధ్య ఆయన చేతికి ధరించిన వాచిపై అందరి కన్ను పడింది. దీని గురించి సోషల్ మీడియాలో సైతం చర్చ జరుగుతోంది. ఆయనకు సంబంధించిన ఓ వీడియోను ‘మైనంపల్లి రోహిత్ మెదక్ టీం’ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ.. వాచ్ ధరను తెలిపింది. ఆ ధర వినగానే అందరి మైండ్ బ్లాంక్ అయిపోయింది.

‘రిచర్డ్ మిల్లే’ కంపెనీకి చెందిన వాచ్ ను మైనంపల్లి రోహిత్ ధరించారని, దీని విలువ దాదాపు రూ.3 కోట్లు అని చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆయనపై ట్రోలింగ్ మొదలుపెట్టేశారు. తమ నాయకురాలు మూడు లక్షల వాచి పెడితేనే కాంగ్రెస్ నేతలు తెగ విమర్శించారని, రోహిత్ ఏకంగా రూ.3 కోట్ల వాచి పెట్టారని దీనికి ఎలా స్పందిస్తారని కౌంటర్ ఇస్తున్నారు. ఇక సాధారణ జనాలు మాత్రం రాజకీయ నాయకులు అందరూ ఒక్కటేనని, ప్రజాధనాన్ని దోచడం, లేదంటే కబ్జాలు, కమీషన్లు ..ఇలా అక్రమ సంపాదనతో విలాసవంత జీవితం గడుపుతారని ఆరోపిస్తున్నారు.