JAISW News Telugu

YCP Politics : నవ్వు తెప్పిస్తున్న వైసీపీ రాజకీయాలు.. అనుకున్నదొక్కటి.. అయ్యింది మరోటి..

YCP Politics

YCP Politics

YCP Politics : ‘రాజకీయాలందు వైసీపీ నేతల రాజకీయాలు వేరయా’ అనేలా వారి విధానాలు కొనసాగుతుంటాయి. కావాలని చేస్తున్నారా? లేక యాధృచ్ఛికమా తెలియదు కానీ ప్రతీ సారి ఎన్నికల ముందు జగన్‌పై అనుకోని దాడి జరగడం. ఇక దానికి కారణం అప్పుడు పాలక పక్షం నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అని. పాలక పక్షంలో ఉండగా జరిగిందంటే కొంతలో కొంత నమ్మారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఇదే చెప్పాలా? ఇది నమ్మేందుకు చాలా కష్టంగా ఉన్నా.. వైసీపీ మాత్రం నమ్మించేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది.

గత ఎన్నికల సమయంలో విశాఖలో జగన్‌పై కోడికత్తి దాడి, వివేకా హత్యపై అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపై చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి తప్పించింది ఈసీ. సరిగ్గా ఐదేళ్ల తరువాత మళ్లీ ఎన్నికల ముందే విజయవాడలో జగన్ పై రాళ్ల దాడి జరిగింది. మళ్లీ సేమ్ స్క్రిప్ట్ ఫాలో అయ్యారు వైసీపీ నేతలు. దాడికి కూడా బాబే కారణమంటూ మళ్లీ రాజకీయం మొదలుపెట్టారు.

ఈ సారి వైసీపీ రాజకీయం ఎలా ఉందంటే వారి వేలితో వారి కన్నే పొడుచుకునేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎవరి స్క్రిప్టులో భాగమో కానీ అది వైసీపీకి ఎదురు దెబ్బగానే భావించాలి. ఇదే కేసు సాకుగా చూపి ప్రతిపక్షాలు కూడా సీఎం భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రాష్ట్ర డీజీపీ, విజయవాడ సీపీ, ఏపీ ఇంటెలిజెన్స్ డీజీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ, జనసేన పార్టీలు ఈసీకి లేఖలు రాశాయి.

వీరి మాటలను తక్కువ అంచనా వేసిన వైసీపీ జగన్ పై హత్యాయత్నం అంటూ కథనాలు ప్రచారం చేయడంతో ఈసీ చర్యలకు పూనుకుంది. ఇందులో భాగంగా విజయవాడ సీపీ, ఏపీ ఇంటెలిజెన్స్ డీజీపై చర్యలు తీసుకుంది. వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించి వారి స్థానంలో ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విజ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్డీ రామకృష్ణ కు బాధ్యతలు అప్పగించింది.

ఈ పరిణామాలతో కంగుతిన్న వైసీపీ దాడిని హైలెట్ చేసి తప్పు చేసేమేమో అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దీని గురించి ఆలోచించిన వారు వైసీపీ తన వేలితే తన కన్నే పొడుచుకుందా? అని అనుకుంటున్నారు. వ్యవస్థలు ఎప్పుడూ ఒకరి చేతిలోనే బంధీగా ఉండవనేది వైసీపీ గ్రహించాలి. 

Exit mobile version