JAISW News Telugu

Suicide : టెక్నాలజీ సాయం.. ఆత్మహత్యకు యత్నిస్తున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

Suicide

Suicide

suicide : టెక్నాలజీ సాయంతో ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు కాపాడారు. హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరప్పనగర్ కు చెందిన మాలంపాక బాబీ (28) ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయల్దేరాడు. అనంతరం తన బావమరిదికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానంటూ చెప్పి ఫోన్ స్విచాఫ్ చేశాడు. కుటుంబసభ్యులు ఆయనకు తెలిసినవారిని సంప్రదించినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్.. బాబీ మొబైల్ సిగ్నల్స్ ను ట్రేస్ చేశారు. సికింద్రాబాద్ లోని మహంకాళి ఏరియాలో ఉన్నట్లు గుర్తించి వెంటనే సిబ్బందిని అక్కడికి పంపించారు. ఓ లాడ్జిలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లగా అప్పటికే బాబీ దోమల మందు తాగి ఉన్నట్లు గమనించారు. వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం ఆయనను కుటుంబసభ్యలకు అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి టెక్నాలజీ సాయంతో నిండు ప్రాణం కాపాడడంలో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు, సీఐ క్రాంతి కుమార్ అభినందించారు.

Exit mobile version