Visakha honey trap case : విశాఖ హనీ ట్రాప్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కిలేడీ జాయ్ జెమీమా చేపట్టిన ఆగడాలు మీడియాకు చిక్కాయి. తన అందాలతో సంపన్నులను ట్రాప్ చేస్తున్న మ్యాజికల్ లేడీ.. సోషల్ మీడియాలో పరిచయమై విదేశాలో ఉన్న వారిని ఇండియాకు రప్పిస్తోందిద.. విచారణలో పోలీసులను షాక్‌కు గురిచేసే పలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖపట్నంలోని షీలానగర్‌కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమాను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కలిశారు. బాధిత యువకుడి ద్వారా షీలానగర్‌లోని వారి చిరునామా తెలుసుకుంది. తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లి కొన్ని రోజులు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని అడగ్గా అందుకు అతని తల్లిదండ్రులు నిరాకరించారు.
ఆ తర్వాత అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖపట్నం రప్పించింది. విమానాశ్రయం నుంచి యువకుడిని మురళీనగర్‌లోని తన ఇంటికి తీసుకెళ్లి బంధించింది. ఆమె అతడికి మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు, డ్రింక్స్ ఇచ్చి, వాటిపై పెర్ఫ్యూమ్‌ను స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలిసి ఉన్నట్లు ఫోటోలు తీయించింది. వాటితో యువకుడిని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో ఆ యువకుడు జెమీమాతో పెళ్లికి ఒప్పించాలని తల్లిదండ్రులకు చెప్పాడు. ఆమె తన స్నేహితులతో కలిసి తరచూ బెదిరించేది. ఇటీవల భీమిలిలోని ఓ హోటల్ లో బలవంతంగా నిశ్చితార్థం చేసుకుని ఓ యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు పెట్టించింది. యువకుడి ఫోన్‌ను బ్లాక్ చేసి, నిశ్చితార్థం, శారీరకంగా కలిసి ఉన్న చిత్రాలను చూపించి.. మళ్లీ మురళీనగర్‌లోని తన ఇంట్లో నిర్బంధించింది. తనను పెళ్లి చేసుకోకుంటే.. ఈ ఫొటోలతో పోలీస్ కేసు పెడతానని, అమెరికా వెళ్లకుండా అడ్డుకుంటానని బెదిరించి తన వద్ద ఉన్న డబ్బులు వసూలు చేసింది.
ఓ సారి ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, సహచరులతో కలిసి కత్తితో అతడిని హత్య చేసేందుకు ప్రయత్నించింది. పెళ్లి చేసుకోకుంటే అమెరికా వెళ్లకుండానే చనిపోతావని ఆమె సహచరులు బెదిరించేవారు. చివరకు ఈ నెల 4న బాధితురాలి నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. మురళీనగర్‌లో పోలీసులు జెమీమాను అదుపులోకి తీసుకున్నారు. శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో జెమీమా, ఆమె స్నేహితులు ప్రేమ పేరుతో ధనవంతులైన అబ్బాయిలను ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేశారని బాధితుడు పోలీసులకు తెలిపాడు. ఈ హనీ ట్రాప్‌లో చాలా మంది యువకులు ఇరుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో నిందితుల లావాదేవీలపై పోలీసులు నిఘా ఉంచారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని పోలీసులు తెలిపారు.