Plane crashed : టేకాఫ్ అవుతుండగా కూలిన విమానం.. 19 మంది మృతి
Plane crashed : నెపాల్ లో బుధవారం ఉదయం ఘోర విమాన ప్రమాదం జరిగింది. రాజధాని ఖాట్మాండ్ ఎయిర్ పోర్టులో రన్ వే నుంచి టేకాఫ్ తీసుకునే సమయంలోనే విమానం జారిపోయి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సిబ్బంది సహా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయానికి విమానంలో నలుగురు సిబ్బంది, 19 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. టేకాఫ్ అవుతుండగా కూలిపోవడంతో మంటలు చెలరేగి అందులోని ప్రయాణికులు, సిబ్బంది సజీవ దహనమయ్యారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
హిమాలయ పర్వతాల మధ్య ప్రకృతి అందాల్లో ఉండే నేపాల్ లో తరచూ విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ ఇటువంటి ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. గత ఏడాది జనవరిలో పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో యతి ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కుప్పకూలి 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు భారతీయులు, ఇతర దేశాలకు చెందిన 14 మందితో పాటు 53 మంది నేపాలీలు ఆ దుర్ఘటనలో మృతిచెందారు. 2010 నుంచి 12 విమాన ప్రమాదాలు అక్కడ జరిగాయి.