Phone calls : శిథిలాల్లో చిక్కుకున్న బాధితుల ఫోన్ కాల్స్.. ప్లీజ్ కాపాడాలని వేడుకోలు.. వయనాడ్ లో హృదయ విదారకర ఘటనలు..

Phone calls

Phone calls : ప్రకృతి ప్రకోపానికి గురైన వయనాడ్‌ నుంచి రోజుకో విషాదకర కథనం బయటకు వస్తుంది. మంగళవారం ఉదయం అక్కడ కొండ చరియలు విడిగిపడడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల్లో చిక్కుకొని పోయారు. ఆ పరిస్థితుల్లో తమ ఆత్మీయులకు ఫోన్లు చేసి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. ఈ ఫోన్‌ సంభాషణలను స్థానిక న్యూస్ ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి. ఓ సంభాషణలో చురల్మల ప్రాంతానికి చెందిన ఒక మహిళ తమ వారికి ఫోన్‌ చేసి.. ఇల్లు మొత్తం శిథిలాల్లో చిక్కుకుంది. మీరు వచ్చి బయటకు తీసి మా ప్రాణాలు కాపాడాలని కోరుతున్నట్లు కనిపిస్తుంది. ‘ఇల్లు మొత్తం పోయింది. మా వాళ్లు ఎక్కడున్నారో తెలియడం లేదు.. ఎవరో ఒకరు వచ్చి సాయం చేయండి’ అని బిగ్గరగా రోధిస్తూ అవతలి వారిని కోరింది. కొండచరియలు కూలే సమయంలో ఆ ప్రాంతం కంపిస్తుండడంతో తాము ఎక్కడికి వెళ్లాలో తెలియలేదని చురల్మలకు చెందిన ఒక వ్యక్తి ఏడుస్తూ వివరించాడు.

ఇక, ముండకైలో ప్రజలు భారీగా బురదలో కూరుకుపోయి విలవిల లాడుతున్నారని పేర్కొంటూ తమకు ఫోన్‌కాల్‌ వచ్చిందని ఓ వ్యక్తి వెల్లడించాడు. ఈ విషాద ఘటనలో గాయపడ్డ ఒక వృద్ధుడు తన భార్య ఆచూకి కనిపించడం లేదని బహూషా గల్లంతై ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశాడు.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడడంతో పాటు బురద కుంగిపోయిన ఘటనలో ఇప్పటి వరకు 50కి పైగా మరణించగా.. 70కి పైగా గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో సహాయక బృందాలు ముందుకెళ్లలేని పరిస్థితి ఉంది. ఐదుగురు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ముండకై ప్రాంతానికి చేరుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

TAGS