Alert News : రాష్ట్ర ప్రజలకు రానున్న మూడు నెలలు అప్రమత్తత అవసరం

Alert News : రానున్న మూడు నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. వడదెబ్బ నుంచి ఉపశమనం పొందడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ముఖ్యంగా ప్రజలు ఎక్కువగా నీరు త్రాగాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి వివిధ శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా పరిస్థితిని సమీక్షించిన ఆయన, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.

TAGS