CM Revanth : అసెంబ్లీకి వస్తే రాని ఓపిక.. టీవీ స్టూడియోకు వెళ్లేందుకు వచ్చిందా?

CM Revanth

CM Revanth

CM Revanth : పార్లమెంట్ ఎన్నికల వేల మళ్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకదానిపై మరోటి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇటీవల వరంగల్ లో నిర్వహించిన ‘జన జాతర’ సభలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ ఓడిపోయినప్పటి నుంచి రేవంత్ రెడ్డిని ఎదుర్కొనేందుకు అసెంబ్లీకి వెళ్లడం మానేసిన విషయం తెలిసిందే. చిన్న పిల్లవాడు బడి మానేసినట్లే అసెంబ్లీ సమావేశాలను కేసీఆర్ మానేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఒక టీవీ ఛానల్ లో 4 గంటల పాటు ఎలా ఉన్నారన్నారు.

టీవీ షోలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ, నాయకులు, పార్టీ నాయకులు తనతో టచ్ లో ఉన్నారంటూ కామెంట్లు చేశారు. వీటిపై రేవంత్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో సమస్యలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు రావాలని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ చచ్చిన పాముగా సీఎం అభివర్ణించారు. ఆగస్ట్ 15వ తేదీ నాటికి రూ.2 లక్షల రైతు రుణమాఫీ పూర్తవుతుందని, తన రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకోవాలని హరీశ్ రావును రేవంత్ రెడ్డి కోరారు. ఎన్నికల సభల్లో దేవుళ్లపై ప్రమాణం చేసి రైతులను తప్పుదోవ పట్టించేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని హరీశ్ రావు పదే పదే చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందనగా రేవంత్ ఈ సవాల్ విసిరారు.  

TAGS