JAISW News Telugu

Roja : పార్టీ మారడం లేదు.. మాజీ మంత్రి రోజా స్పందన

Roja

Roja

Roja : వైసీపీ సీనియర్ నేత, మాజీమంత్రి రోజా పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. వైసీపీకి రాజీనామా చేసి త్వరలోనే ఆమె ఓ తమళ పార్టీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పుపై రోజా స్పందించారు. ఈరోజు (శనివారం) ఆమె కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం మాజీమంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ తాను పార్టా మారుతున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారడం లేదని, జగనన్నతోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అధికారంలో ఉన్నపుడు పదవులు అనుభవించి, పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు పార్టీని విడిచి వెళ్తున్నవారు ఒకసారి పునరాలోచన చేసుకోవాలని హితవు పలికారు. ఆపత్కాలంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరని హెచ్చరించారు.

Exit mobile version