JAISW News Telugu

Cab driver : భారత్‌ను కించపరిచిన పాకిస్థానీ.. బుద్ధి చెప్పిన క్యాబ్ డ్రైవర్

Cab driver

Cab driver

Cab driver : ఇండియా అంటే పాకిస్థాన్ కు ఎంతటి కడుపు మంటో అందరికీ తెలిసిందే. అక్కడి పౌరులు, ప్రముఖులు సైతం భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. వాస్తవానికి అంతర్జాతీయంగా భారత్, భారతీయులు అంటే ఎంతో ప్రతిష్ఠ, గౌరవం ఉన్నాయి. అదే సమయంలో పాకిస్థాన్ అంటే ప్రపంచానికి ఎంతో అపనమ్మకం అని అందరికీ తెలుసు. భారత్ ను ఇబ్బంది పెట్టడానికి చైనా చేతిలో పావుగా మారింది పాక్. ఆ దేశ పౌరులు సైతం భారత్ పై అక్కసు వెళ్లగక్కి అప్రతిష్ఠపాలవుతుంటారు. అలాంటిదే ఓ సంఘటన తాజాగా బయటకు వచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భారత్‌ను కించపరుస్తూ మాట్లాడిన ఓ పాకిస్థానీ, అతడి ఇండియన్ గర్ల్ ఫ్రెండ్‌కు ఓ క్యాబ్ డ్రైవర్ తగిన బుద్ధి చెప్పాడు.  వివరాల్లోకి వెళితే… పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి… తన భారతీయ ప్రియురాలితో కలిసి ఢిల్లీలో ఉబర్ కారులో వెళ్తున్నాడు. అయితే దారిలో  పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి భారతీయులను కించపరుస్తూ మాట్లాడాడు. అతని స్నేహితురాలు కూడా పాకిస్తానీ వ్యక్తికి మద్దతు ఇచ్చింది. దీంతో క్యాబ్ డ్రైవర్‌కు కోపం వచ్చింది. మార్గమధ్యంలో కారు ఆపి ఇద్దరిని బయటకు తోసేశాడు. ఆ తర్వాత వారిని గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు నిరాకరించాడు.

కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనను ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ వీడియో తీసింది. ఈ వ్యక్తి మమ్మల్ని అర్ధరాత్రి రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడని ఆమె చెప్పింది. ఇది మోదీజీ భారతదేశం అంటూ ఆయనతో వాదించారు. ఇది హిందుస్థాన్ అంటూ క్యాబ్ డ్రైవర్ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. మీరంతా హలాలా సంతానం అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన దేశభక్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు కూడా ఆయనపై విమర్శలు చేస్తున్నారు.

Exit mobile version