JAISW News Telugu

Guntur Kaaram :  ‘గుంటూరు కారం’ ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది..

Guntur Kaaram release date in OTT

Guntur Kaaram release date in OTT

Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ జనవరి 12 వ తారీఖున విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అంచనాలు వేరే లెవెల్ లో ఉంటాయి, ఎందుకంటే గతం లో వాళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన క్లాసిక్ చిత్రాలు అలాంటివి. ఆ రేంజ్ స్టాండర్డ్స్ కనీస స్థాయిలో లేకపోయినా నిరాశ చెందుతాము, అలాంటిది చెత్త సినిమా తీస్తే అభిమానులు, ప్రేక్షకులు తీసుకోగలరా?, సరిగ్గా ఈ విషయం లో కూడా అదే జరిగింది.

కానీ సంక్రాంతి సెలవులకి తోడు, మహేష్ బాబు సూపర్ స్టార్ స్టేటస్ ఈ చిత్రాన్ని ఆంధ్ర ప్రాంతం వరకు కొంత సేవ్ చేసింది అనే చెప్పాలి. మిగిలిన అనీ ప్రాంతాల్లో కూడా 50 శాతం కంటే ఎక్కువే నష్టాలు వచ్చాయి. టాక్ ప్రభావం కారణంగా ఈ సినిమాని థియేటర్స్ లో చూడకుండా ఓటీటీ లో వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని చాలా మంది అనుకున్నారు.

ఇప్పుడు అలాంటి ఓటీటీ ఆడియన్స్ కి ఒక శుభ వార్త. ఈ సినిమా విడుదలకు ముందే నెట్ ఫ్లిక్స్ సంస్థ కి భారీ ప్రైజ్ కి అమ్ముడుపోయింది. ఒప్పందం ప్రకారం సినిమా విడుదలైన 28 రోజులకు ఓటీటీ లో అప్లోడ్ చేసుకోవచ్చు. అంటే ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లోకి ఫిబ్రవరి 10 వ తేదీ లోపు స్ట్రీమింగ్ కాబోతుంది అన్నమాట. సలార్ చిత్ర బృందం తో కూడా నెట్ ఫ్లిక్స్ ఇలాగే ఒప్పందం చేసుకుంది. సరిగ్గా 28 రోజుల తర్వాత ఆ చిత్రాన్ని నిన్ననే నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేసారు. ఇప్పుడు ‘గుంటూరు కారం’ విషయం లో కూడా అదే జరగబోతుంది.

అయితే ‘గుంటూరు కారం’ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చి, సంక్రాంతి సెలవులు పూర్తి అవ్వగానే అనేక ప్రధాన నగరాల్లో షేర్ వసూళ్లు కూడా రావడం ఆగిపోయాయి కాబట్టి, ఆ సినిమా రన్ దాదాపుగా పూర్తి అయిపోయినట్టే. దీంతో ఈ సినిమా అనుకున్న తేదీ కంటే ముందే స్ట్రీమింగ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి, ఏదైనా జరగొచ్చు. మరి ఈ సినిమా ఫిబ్రవరి 10 లోపు వస్తుందా, లేదా ఇంకా ముందు వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 145 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Exit mobile version