JAISW News Telugu

Gunturkaaram Vs HanuMan : ‘గుంటూరు కారం’ ని డామినేట్ చేసేసిన ‘హనుమాన్’ ఓపెనింగ్స్..ఇదేమి కొట్టుడు సామీ!

Guntur kaaram Vs HanuMan

Guntur kaaram Vs HanuMan

Gunturkaaram Vs HanuMan : నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన ‘గుంటూరు కారం’ తో పాటుగా ‘హనుమాన్’ చిత్రం కూడా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై గత ఏడాది లో టీజర్ విడుదలైన రోజు నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిన్న సినిమాలలో పెద్ద హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు కానీ, పెద్ద హీరో సినిమాతో పోటీ పడి, ఆ హీరో సినిమాని డామినేట్ చేస్తుందని మాత్రం ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు.

నేడు అదే జరిగింది, కొన్ని ప్రాంతాలలో హనుమాన్ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గుంటూరు కారం కి జరగడం లేదు. అందుకు కారణం హనుమాన్ కి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడం, అలాగే ‘గుంటూరు కారం’ చిత్రానికి ఫ్లాప్ టాక్ రావడం. ఈమధ్య కాలం లో ‘బుక్ మై షో’ యాప్ లో గంటకి ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి అనేది తెలుస్తుంది.

ఈ సరికొత్త ఫీచర్ ని మీరందరు కూడా చూసే ఉంటారు. ఈ యాప్ అందిస్తున్న లెక్కల ప్రకారం ‘హనుమాన్’ చిత్రానికి గంటకి 20 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతుంటే, ‘గుంటూరు కారం’ చిత్రానికి కేవలం 16 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. మహేష్ – త్రివిక్రమ్ లాంటి సెన్సేషనల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఒక్క చిన్న హీరో సినిమా ఓపెనింగ్ ముందు తేలిపోవడం అనేది ట్రేడ్ చాలా పెద్ద షాక్. మొదటి రోజే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక రేపటి నుండి ఎలా ఉంటుందో, సంక్రాంతి సెలవలే ‘గుంటూరు కారం’ చిత్రాన్ని కాపాడాలి అంటూ ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ‘హనుమాన్’ చిత్రానికి మాత్రం ఇక బాక్స్ ఆఫీస్ కి హద్దులే లేవు. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో దద్దరిల్లే రేంజ్ ఓపెనింగ్ వచ్చింది. రేపటి నుండి నార్త్ ఇండియా లో కూడా ఈ సినిమా దంచికొడుతుందని ఆశిస్తున్నారు. నార్త్ ఇండియన్స్ మన హిందూ దేవుళ్ళకు  సంబంధించిన సినిమాలను ఎంతగానో ఆదరిస్తారు.

‘కార్తికేయ 2’ ఏ రేంజ్ లో ఆడిందో మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘హనుమాన్’ చిత్రం అంతకు మించి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న డిమాండ్ చూస్తూ ఉంటే, రాబొయ్యే రోజుల్లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. రేపటి నుండి అన్నీ చోట్ల థియేటర్స్, షోస్ పెంచేశారు, ఇక బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుంటుందో చూడాలి.

Exit mobile version