JAISW News Telugu

Tollywood industry : ఒక్కటైన టాలీవుడ్ ఇండస్ట్రీ.. ఇంత ధైర్యం ఎక్కడిది.. కొండా సురేఖ టార్గెట్గా వ్యాఖ్యలు

FacebookXLinkedinWhatsapp
Tollywood industry

Tollywood industry

Tollywood industry : కొండా సురేఖ , అక్కినేని నాగార్జున సమంత వివాదంలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఒక్కటైపోయారు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు వ్యతిరేకంగా అందరూ భయపడిపోయారు. కాగా ఈసారి ఏకమై తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై మండిపడుతున్నారు. ఏకంగా నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నానని ఒక మంత్రి హోదాలో ఉండే మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని ప్రశ్నించారు.

చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, సమంత నాగచైతన్య,  ప్రకాష్ రాజ్ లాంటి అందరూ స్పందించారు. చాలా దారుణమైన వ్యాఖ్యలు అని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే ఇంత చిన్నచూపు చులకన అవసరం లేదని కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని ఒక మహిళ అయి ఉండి మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒక కుటుంబాన్ని వివాదాల్లోకి లాగడం సరైనది కాదని హెచ్చరించారు.

ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించడమే కాకుండా  క్షమాపణ చెప్పాలని ఆమెపై కోర్టులో కేసు వేయాలని అనుకుంటున్నారు. అదే విధంగా అక్కినేని నాగార్జున కూడా దీనిపై సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకునేందుకు ఆయన సిద్ధపడ్డారు. అక్కినేని నాగార్జున, సమంత నాగచైతన్యను ఈ వివాదంలోకి
లాగటంతో రాజకీయాలు చేసుకునేవారు రాజకీయాలు చేసుకోవాలని సామాన్య మైన వాళ్ళని ఎలాంటి సంబంధం లేని వాళ్ళని సెలబ్రిటీలను తమ రాజకీయాల్లోకి లాగకూడదని హితవు పలికారు.

కొండా సురేఖ ఈ వివాదంలో సమంతకు క్షమాపణలు చెప్పింది. కేటీఆర్ పై మాత్రం తన పోరాటం కొనసాగిస్తామని ఆమె ప్రకటించింది. సమంత కూడా తనను రాజకీయాలకు అతీతంగా
చూడాలని కోరింది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా తనకు రాజకీయ వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. అయితే టాలీవుడ్ ప్రముఖులు ఎంత ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. టాలీవుడ్ పెద్దల వెనుక ఎవరున్నారు. వారి ధైర్యం ఏమిటి ? గతంలో జగన్ పై ఎందుకు ఇలా చేయలేరు. తెలంగాణ మంత్రిపై ఈ విధంగా చేయడానికి గల వారి ధైర్యం ఎవరు అనే చర్చ కొనసాగుతుంది. ఇదే యూనిటీ టాలీవుడ్ ప్రముఖులకు అన్ని విషయాల్లో ఉంటుందా లేదా అనేది చూడాలి.

Exit mobile version